BigTV English
Advertisement

Viral Video: పెళ్లి మండపంలో పురోహితుడికి కోపం.. దెబ్బకు గాల్లో ఎగిరి.. వీడియో వైరల్!

Viral Video: పెళ్లి మండపంలో పురోహితుడికి కోపం.. దెబ్బకు గాల్లో ఎగిరి.. వీడియో వైరల్!

వివాహం అనేది జీవితంలో ఒకేసారి జరుపుకుంటారు. ప్రతి వారు తమ పెళ్లి ఇలా జరగాలి, అలా జరగాలి అని కలలు కంటారు. ఉన్నదాంట్లో ఘనంగా జరుపుకోవాలని భావిస్తారు. బంధుమిత్రుల కోలాహలం నడుమ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి అవుతారు. అయితే, ఒకప్పుడు సంప్రదాయ బద్దంగా జరిగే పెళ్లిళ్లు, ఇప్పుడు వింతపోకడలకు వేదికలుగా మారుతున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్స్, హల్దీ, సంగీత్ అంటూ నానా రచ్చ చేస్తున్నారు. గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఫోటోలు, వీడియోల గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిది. వీళ్లు పెళ్లే చేసుకోబోతున్నారా? అనే అనుమానం కలిగించేలా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ పెళ్లిలోనూ పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ వ్యవహరిస్తున్న తీరుపై పురోహితుడు కోపంతో ఊగిపోయారు. చేతిలోని పళ్లెం విసరికొట్టారు. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?


కోపంతో పూల పళ్లెం విసిరేసిన పురోహితుడు

మంగళసూత్రం కట్టిన తర్వాత వధూవరులు ఇద్దరూ అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అదే సమయంలో స్టేజి మీద ఉన్న వారి స్నేహితులు నూతన దంపతుల మీద పూలు చల్లుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కానీ, ఇద్దరు యువకులు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు మీద కాకుండా పురోహితుడి మీద పూలు విసిరారు. దీంతో పంతులుకు ఒక్కసారిగా కోపం తన్నుకొచ్చింది. నా మీదే పూలి విసిరి పరాచికాలు ఆడుతారా? అంటూ తన చేతిలోని పళ్లెంను ఆ యువకుడి మీదికి విసిరికొట్టాడు. వారి దగ్గరికి వదూసుకెళ్లి, వధూవరులను కాదని, తన మీద పూలు చల్లడం ఏంటంటూ కోపంతో ఊగిపోయారు. పురోహితుడి వ్యవహార తీరుతో ఒక్కకసారిగా పెళ్లిలోని వాళ్లంతా షాక్ అయ్యారు. పెద్దవాళ్లు కలుగజేసుకుని వివాదాన్ని సర్దుమణిగేలా చేశారు.


తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నెటిజన్లు

పెళ్లిలో పిచ్చివేషాలు వేస్తే ఇలాగే అవుతుందంటూ నెటిజన్లు పురోహితుడికి మద్దతు పలుకుతున్నారు. పవిత్రమైన వివాహ వేదికపై చిల్లరగా ప్రవర్తించడం ఏంటని మండిపడుతున్నారు. పురోహితుడి కోపం నూటికి నూరు పాళ్లు సమంజసమైనదని చెప్తున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత అయినా పెళ్లి మండపంలో తిక్క వేషాలు వేయడం మానుకోవాలని హితవు పలుకుతున్నారు.

Read Also:నడి రోడ్డుపై రీల్స్.. ఇంతలో వేగంగా వచ్చిన కారు, అంతా ఎగిరిపడ్డారు!

ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

ఇక ఈ పెళ్లి కొద్ది రోజుల క్రితం చత్తీస్‌ గఢ్‌ లోని కాపు గ్రామంలో జరిగింది. వధువు ప్రతిమ లాహ్రే, వరుడు ఎమాన్ లాహ్రే మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. వేలాది వ్యూస్ అందుకుంటున్నది. పెళ్లి అనేది ఈ రోజుల్లో ఓ కామెడీగా మారిపోయిందని చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు. యువత పెళ్లి అంటే బాధ్యత అనే విషయాన్ని మరిచిపోతున్నారని అభిప్రాయపడుతున్నారు.

Read Also: కారు డ్రైవింగ్ చేస్తూ ముద్దులతో రెచ్చిపోయిన జంట, చివరికి..

Related News

Viral Video: వర్షంలో కుప్పకూలిన అమెరికా అమ్మాయికి ఇండియన్ కుర్రాడు సాయం.. నెటిజన్స్ ఫిదా!

Longest Name: ప్రపంచంలోనే పొడవైన పేరున్న వ్యక్తి ఇతడే.. ఏకంగా గిన్నిస్ రికార్డు కొట్టేశాడు!

Shocking Video: లక్నోలో రెచ్చిపోయిన యువతి.. కారులో నగ్నంగా ప్రయాణం.. వీడియో వైరల్

Viral Video: ఆఫీసులో తింగరి వేషాలేంటి? హీటెక్కిపోయిన బ్యాంక్ మేనేజర్, ఆ తర్వాత ఏం జరిగిందంటే

Man Wins Rs 240 Cr Lottery: తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ.. ఇదిగో ఇలా చేస్తే మీరూ కోటీశ్వరులే!

Hanumakonda: కోయ్.. కోయ్.. కొక్కొరొక్కో.. కోళ్ల కోసం జనం పరుగుల వేట

Orange Shark: అరుదైన ఆరెంజ్ షార్క్.. భలే బాగుంది, కానీ చాలా డేంజర్ సుమా!

Safety Pin: ఈ పిన్నీసు కొనాలంటే ఆస్తులు అమ్మాల్సిందే, మరీ అంత ధర ఏంట్రా అయ్యా?

Big Stories

×