DEENDAYAL PORT AUTHORITY: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఇంటర్మీడియట్, డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఇది సువర్ణవకాశంగా చెప్పవచ్చు. దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ, కచ్ లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
గుజరాత్, ఖచ్ లోని దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ(DEENDAYAL PORT AUTHORITY) కాంట్రాక్ట్ విధానంలో ఖాళీగా ఉన్న సిగ్నల్ మెన్, సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకీ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 5న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 4
ఖచ్ లోని దీన్ దయాల్ పోర్ట్ అథారిటీలో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో సిగ్నల్ మెన్, సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు..
సిగ్నల్ మెన్ : 3 ఉద్యోగాలు
సేఫ్టీ ఆఫీసర్ : 1 ఉద్యోగం
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఇంటర్, డిగ్రీ పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 5
జీతం: ఉద్యోగాన్ని బట్టి వేతనాన్ని నిర్ణయించారు. నెలకు సిగ్నల్ మెన్ ఉద్యోగానికి అయితే రూ.60 వేల జీతం ఉంటుంది. సేప్టీ ఆఫీసర్ పోస్టుకు నెలకు రూ.65 వేల జీతం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
చిరునామా: దరఖాస్తు ఫారంను ది డిప్యూటీ కన్జర్వేటర్, దీన్ దయాల్ పోర్ట్ అథారిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్, పోస్ట్ బాక్స్ నంబర్-50, గాంధీధామ్ ఖచ్, గుజరాత్-370241 అడ్రస్ కు పంపాలి.
ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.deendayalport.gov.in/en/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. ఉద్యోగాన్ని బట్టి వేతనాన్ని నిర్ణయించారు. నెలకు సిగ్నల్ మెన్ ఉద్యోగానికి అయితే రూ.60 వేల జీతం ఉంటుంది. సేప్టీ ఆఫీసర్ పోస్టుకు నెలకు రూ.65 వేల జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
Also Read: Planning Department: ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీలు.. నెలకు రూ.60,000 జీతం.. ఇదే మంచి అవకాశం..
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 4
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 5