BigTV English

Train Coaches: సముద్ర జలాల్లో రైలు బోగీల సమాధి, ఎందుకలా?

Train Coaches: సముద్ర జలాల్లో రైలు బోగీల సమాధి, ఎందుకలా?

ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశంగా అమెరికా గుర్తింపు తెచ్చుకుంది. ఈ రైల్వే నెట్ వర్క్ ను ప్రజా రవాణా కంటే సరుకు రవాణాకే ఎక్కువగా వినియోగిస్తారు. అన్ని ముఖ్య నగరాల్లో అత్యాధునిక మెట్రో వ్యవస్థ అందుబాటులో ఉంది. తక్కువ ఖర్చులో ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందిస్తోంది. అయితే, న్యూయార్క్ నగరానికి చెందిన సబ్ వే రైల్వే కోచ్ లను అట్లాంటిక్ మహా సముద్రంలో పడేస్తుంది. విధుల్లో నుంచి తప్పించిన బోగీలను సముద్ర జలాల్లో సమాధి చేస్తుంది. న్యూయార్క్ అధికారులు ఇప్పటి వరకు సుమారు 2500 రైల్వేకోచ్ లను సముద్రంలో పడేశారు. ఎందుకు అలా చేస్తున్నారు? కనీసం పాత ఇనుప సామానుకైనా అమ్మేస్తే డబ్బులు వస్తాయి కదా? అని చాలా మంది అనుకుంటున్నారు. అసలు విషయం ఏంటంటే?


ప్రపంచంలోనే పురాతన సబ్ వే ట్రాన్స్ పోర్టు సిస్టమ్!

అమెరికాలో అత్యంత ఎక్కువ మంది జనాభా ఉండే నగరం న్యూయార్క్. ఈ నగరం అతిపెద్ద ప్రజా రవాణ వ్యవస్థను కలిగి ఉంది. ప్రతి రోజు కొన్ని వేల మంది ప్రయాణీకులు న్యూయార్క్ లోని సబ్ వే ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ ద్వారా రాకపోకలు కొనసాగిస్తుంటారు. ఈ రైళ్లు 24 గంటల పాటు నడుస్తూనే ఉంటాయి. ఈ సబ్ వే లైన్ న్యూయార్క్ లోని అన్ని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ వెళ్తుంది. ఇది ప్రపంచంలోనే పురాతన సబ్ వే ట్రాన్స్ పోర్టు వ్యవస్థగా గుర్తింపు తెచ్చుకుంది. 1907 అక్టోబర్ 7న న్యూయార్క్ సబ్ వే ట్రాన్స్ పోర్టు ప్రారంభం అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తన సర్వీసులను కొనసాగిస్తూనే ఉంది. మొత్తం 472 స్టేషన్లను కలిగి ఉంది.


Read Also:  4.5 గంటల్లో రైల్వే బ్రిడ్జి నిర్మాణం, ఇండియన్ రైల్వే సరికొత్త రికార్డు!

సబ్ వే రైల్ కోచ్ లను సముద్రంలో ఎందుకు పడేస్తున్నారు?

ఏండ్ల పాటు ప్రయాణీకులకు సేవలను అందించి పలు రైళ్లు తమ సర్వీసుల నుంచి తప్పుకుంటున్నాయి. ఇప్పుడున్న టెక్నాలజీకి అనుగుణంగా పాతవాటిని రన్ చేయడం కష్టంగా ఉంటుంది. ఈ నేపథ్యం న్యూయార్క్ సిటీ గవర్నమెంట్ పాడైపోయిన సబ్ వే బోగీలను సముద్రంలో పడేయాలని నిర్ణయించింది. 2001 నుంచి 2010 వరకు సుమారు 2000 బోగీలను నీళ్లలో పడేశారు. ఇలా చేయడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందనే అనుమానం కలుగతుంది కదా? కానీ, ఆ అనుమానంలో నిజం లేదు. ఈ రైలు బోగీలు సముద్రం అడుగు భాగంగాలో చేపలు సహా ఇతర జీవులకు నివాస యోగ్యమైన ఆర్టిఫీషియల్ ఇళ్లలాగా పని చేస్తున్నాయి. అయితే. ఈ రైల్ కోచ్ లను సముద్రంలో పడేసే ముందు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు అధికారులు. విండో గ్లాస్ లు, సీట్లు, సైన్ బోర్డులు, వీల్స్, పెట్రోలియం ప్రొడక్టులను తొలగిస్తాయి. కోచ్ క్లీనింగ్ ప్రక్రియ మొదలైన తర్వాత సముద్రం నీళ్లు ఆ కోచ్ లోకి ఈజీగా వెళ్లేలా తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ తర్వాత వాటిని నీళ్లలోకి వదులుతారు.

Read Also: వేల టన్నుల బరువు ఉండే క్రూయిజ్ షిప్ సముద్రంలో మునగదు, ఎందుకో తెలుసా ?

Related News

Air India Offer: బస్ టికెట్ ధరకే ఫ్లైట్ టికెట్, ఎయిర్ ఇండియా అదిరిపోయే ఆఫర్!

Lemon Crushing: కొత్త వెహికిల్ టైర్ల కింద నిమ్మకాయలు పెట్టే ఆచారం.. దీని వెనుక ఇంత పెద్ద కథ ఉందా?

Coconut Price: భారత్ లో రూ. 50 కొబ్బరి బోండాం, అమెరికా, చైనాలో ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!

Bali vacation: బాలి వెకేషన్ కు వెళ్దాం వస్తావా మామా బ్రో.. ఖర్చు కూడా తక్కువే!

Male River: దేశంలో ప్రవహించే ఏకైక మగ నది ఇదే, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డ్.. ఒక్క రోజులోనే ఇంత మంది ప్రయాణికులా?

Big Stories

×