BigTV English
Advertisement

Ram Charan Peddi : పెద్ది షాట్ రీ క్రియేట్… ఢిల్లీ క్యాపిటల్స్‌ను పొగుడుతూనే కౌంటర్ ఇచ్చిన రామ్ చరణ్

Ram Charan Peddi : పెద్ది షాట్ రీ క్రియేట్… ఢిల్లీ క్యాపిటల్స్‌ను పొగుడుతూనే కౌంటర్ ఇచ్చిన రామ్ చరణ్

Ram Charan Peddi: సినిమా, క్రికెట్..ఈ రెండు రంగాలకు మన దేశంలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ రెండూ కలిస్తే ఉండే సందడి వేరే లెవెల్.. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమాలోని ఒక ఐకానిక్ షాట్‌ను… ఏకంగా ఐపీఎల్ జట్టు రీక్రియేట్ చేసింది.. ఇంతకీ ఆ జట్టు ఏది? ఎందుకు చేసింది? తెలుసుకుందాం రండి..


పెద్ది షాట్ రీ క్రియేట్..

కొద్ది రోజుల క్రితం రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి ఒక గ్లింప్స్ విడుదలైంది. క్రికెట్ నేపథ్యంలో సాగుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక ప్రత్యేకమైన సిగ్నేచర్ షాట్‌తో కనిపించారు. ఆ షాట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అయితే, ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ ఊపందుకున్న నేపథ్యంలో, ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఒక సరికొత్త ఆలోచనతో ముందుకు వచ్చింది. నేడు హైదరాబాద్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు చాలా కీలకం. వారు ప్రస్తుతం 12 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నారు. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పకుండా విజయం సాధించాల్సిందే. మరోవైపు, సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదు. వారు 10 మ్యాచ్‌ల్లో ఏడింట్లో ఓడిపోయి 6 పాయింట్లతో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. దీంతో ఇరు జట్ల మధ్య ఈరోజు జరగబోయే పోరు చాలా రసవత్తరంగా ఉంటుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు.


ఇలాంటి ఉత్కంఠభరితమైన సమయంలో, ఢిల్లీ క్యాపిటల్స్ తెలుగు ప్రేక్షకులను మెప్పించే ఒక అద్భుతమైన ప్లాన్‌తో ముందుకు వచ్చింది. రామ్ చరణ్ వైరల్ ‘పెద్ది’ సినిమా షాట్‌ను తమ ఆటగాళ్లతో రీక్రియేట్ చేసి ఒక ప్రత్యేకమైన వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ వీడియో విడుదలైన వెంటనే నెటిజన్లు, అభిమానుల నుండి భారీ స్పందన లభిస్తోంది. చాలా మంది ఈ ప్రయత్నాన్ని అభినందిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ క్రియేటివిటీని మెచ్చుకుంటున్నారు.

కౌంటర్ ఇచ్చిన రామ్ చరణ్…

అంతేకాకుండా, చాలా మంది క్రికెట్ అభిమానులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సొంతగడ్డపై మ్యాచ్ జరుగుతున్నప్పటికీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇలాంటి తెలుగువారిని ఆకట్టుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదని విమర్శిస్తున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ ఈ తెలివైన మార్కెటింగ్ వ్యూహాన్ని ప్రశంసిస్తున్నారు. అయితే ఈ వీడియోపై మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ స్పందిస్తూ పెద్ది షాట్‌ను రిక్రియేట్‌ చేసినందుకు థాంక్యూ చెబుతూ.. ఈరోజు మ్యాచ్‌కి విషెస్‌ తెలిపారు. అంతేకాకుండా.. సిద్ధంగా ఉండండి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరింత బలంగా తిరిగి రావచ్చు అంటూ.. కౌంటర్‌ కూడా ఇచ్చారు రామ్‌చరణ్‌..

ఇక ‘పెద్ది’ సినిమా విషయానికి వస్తే, ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌, వృద్ధి సినిమాస్‌, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×