OTT Movie : క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు ఏ భాషలో వచ్చినా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు మూవీ లవర్స్. ఇప్పుడు ఈ సినిమాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి ? మంచి కంటెంట్ ఉన్న స్టోరీలతో మతిపోగొడుతున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే క్రైమ్ థ్రిల్లర్ సినిమా, కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. ఊహించని క్లైమాక్స్ ట్విస్ట్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ పేరు ‘తత్సమ తద్భవ’ (Tatsama Tadbhava). 2023లో విడుదలైన ఈ సినిమాకి విశాల్ అత్రేయ దర్శకత్వం వహించారు. PB స్టూడియోస్, అన్విట్ సినిమాస్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందింది. ఇందులో మేఘనా రాజ్ సర్జా (అరికా), ప్రజ్వల్ దేవరాజ్ (అరవింద్ ఆశ్వత్థామ), బాలాజీ మనోహర్, గిరిజా లోకేష్ (సవితా), మహతి వైష్ణవి భట్ (నిధి) ప్రధాన పాత్రల్లో నటించారు. వసుకి వైభవ్ సంగీతం, శ్రీనివాస్ రామయ్య సినిమాటోగ్రఫీ, రవి అరాధ్య ఎడిటింగ్‌తో, ఈ సినిమా 2023 సెప్టెంబర్ 15న థియేటర్లలో విడుదలైంది. 2023 అక్టోబర్ 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. 122 నిమిషాల రన్ టైమ్ ఉన్న ఈ సినిమాకి, IMDbలో 7.5/10 రేటింగ్ ఉంది. ఇది 2023లో కన్నడ సినిమా ఇండస్ట్రీలో టాప్ 10 చిత్రాలలో ఒకటిగా నిలిచింది.
స్టోరీలోకి వెళితే
అరికా తన భర్త సంజయ్ కనిపించట్లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తుంది. అరవింద్ అనే ఒక అనుభవజ్ఞుడైన పోలీస్ ఇన్‌స్పెక్టర్, ఈ కేసును తీసుకుంటాడు. అరవింద్ తన స్కిల్స్ ను ఉపయోగించి ఈ కేసును డీప్‌గా విచారిస్తాడు. ఈ ఇన్వెస్టిగేషన్ లో సంజయ్ మృతదేహం అరికా ఇంటి బేస్‌మెంట్‌లో లభిస్తుంది. ఇక ఇది మిస్సింగ్ కేసు నుంచి, మర్డర్ కేసుగా మారుతుంది. అంతే కాకుండా అరికా ప్రధాన నిందితురాలిగా మారుతుంది. అరవింద్ ఇన్వెస్టిగేషన్ చేసే సమయంలో, అరికా గురించి మరిన్ని రహస్యాలు బయటపడతాయి. ఆమె గతంలో అకిరా అనే గిటార్ ప్లేయర్‌తో సంబంధం ఉందని, సంజయ్‌తో ఆమె వివాహం సంతోషకరంగా లేదని తెలుస్తుంది.
సంజయ్ తన కూతురితో కూడా అమానుషంగా ఉండేవాదని తెలుస్తుంది. అరికా ఇంట్లో లభించిన గిటార్, సంజయ్ బాస్ ప్రవర్తన, మెయిడ్ సవితా వివరణలు కేసును మరింత ఉత్కంఠతను పెంచుతాయి. స్టోరీ ముందుకు వెళ్ళే కొద్ది అసలు రహస్యాలు బయటపడతాయి. చివరికి సంజయ్ ని చంపింది ఎవరు ?అరికాకి గిటార్ ప్లేయర్ తో ఉన్న కనెక్షన్ ఎలాంటిది ? అరవింద్ ఈ కేసులో బయట పెట్టే రహస్యాలు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : పోలీస్ మిస్సింగ్… కుక్క హత్యతో ఊహించని టర్న్… గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఓటీటీ షేక్