Indian Railways: సంక్రాంతి పండుగ సమీపిస్తున్న వేళ్ల సొంతూళ్లకు వెళ్లాలనుకునే తెలుగు రాష్ట్రాల ప్రజలకు సౌత్ సెంట్రల్ రైల్వే బ్యాడ్ న్యూస్ చెప్పింది. కాజీపేట-విజయవాడ సెక్షన్ లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల నేపథ్యంలో ఈ రూట్ లో ప్రయాణించే పలు రైళ్లను రద్దు చేయడంతో పాటు మరికొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. మోటుమారి జంక్షన్ దగ్గర ఈ పనులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
రద్దు అయిన రైళ్ల వివరాలు
రైల్వే అధికారులు విడుదల చేసిన ప్రకటనలో విజయవాడ-డోర్నకల్ మధ్య నడిచే (07755/07756) రైలుతో పాటు విజయవాడ-భద్రాచలం మధ్య నడిచే (07979/07978) రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ రెండు రైళ్లు డిసెంబర్ 25 నుంచి జనవరి 9 వరకు క్యాన్సిల్ చేసినట్లు తెలిపారు. అటు ఈ నెల 28, 29తో పాటు జనవరి 2, 5,8, 9న గుంటూరు-సికింద్రాబాద్ మధ్య నడిచే (12705/12706) రైళ్లను కూడా క్యాన్సిల్ చేసినట్లు తెలిపారు. అటు జనవరి 1, 4, 7, 8, 9 రోజున విజయవాడ-సికింద్రాబాద్ మధ్య నడిచే(12713/12714) రైళ్లను కూడా క్యాన్సిల్ చేశారు. ఈనెల 28, 30 జనవరి 4, 6న కొచువెల్లి- ఇండోర్ (22645/22646) రైళ్లతో పాటు డిసెంబర్ 26, 31తో పాటు జనవరి 5, 8న గోరఖ్ పూర్- కొచువెల్లి మధ్య నడిచే (12511/12512) రైళ్లను రద్దు చేశారు. మరోవైపు ఈనెల 30తో పాటు జనవరి 3, 6, 10న ఎర్నాకులం- బరౌని మధ్య నడిచే (12521/12522) రైళ్లను క్యాన్సిల్ చేశారు. అటు జనవరి 3, 8, 10లో కాన్పూర్ –మధురై (01927/01928), జబల్పూర్-మధురై మధ్య నడిచే (02121/02122) రైళ్లను రద్దు చేశారు. డిసెంబర్ 28, జనవరి 1, 4న ధన్ బాద్- కోయంబత్తూర్ (03325/03326) రైళ్ళను కూడా క్యాన్సిల్ చేశారు.
Read Also: జనవరి 1 నుంచి మారనున్న రైల్వే టైమ్ టేబుల్.. వెంటనే చెక్ చేసుకోండి!
కొన్ని రైళ్లు దారిమళ్లింపు, మరికొన్ని ఆలస్యం
⦿ తిరువనంతపురం నార్త్ (కొచువేలి) – గోరఖ్ పూర్ మధ్య నడిచే రప్తిసాగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ తిరువనంతపురం నార్త్ నుంచి డిసెంబర్ 29 ఉదయం 6.35 గంటలకు బయల్దేరాల్సి ఉండగా, కాస్త ఆలస్యం కానున్నట్లు అధికారులు తెలిపారు.
⦿ తిరువనంతపురం నార్త్ (కొచువేలి) – ఇండోర్ మధ్య నడిచే అహల్య నగరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ డిసెంబర్ 28న ఉదయం 6.35 గంటలకు తిరువనంతపురం నార్త్ లో బయల్దేరుతుంది. ఈ రైలు MGR చెన్నై సెంట్రల్, రేణిగుంట, గూటి, ధోన్, కాచిగూడ, మౌలాలి మీదుగా నడువనుంది.
⦿ అటు ఇండోర్ – తిరువనంతపురం నార్త్ (కొచువేలి) మధ్య నడిచే అహల్య నగరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ డిసెంబర్ 30న సాయంత్రం 4.45 గంటలకు ఇండోర్ లో బయల్దేరుతుంది. ఈ రైలు కాచిగూడ, మౌలాలి, ధోన్, గూటి, రేణిగుంట MGR చెన్నై సెంట్రల్ మీదుగా వెళ్లనుంది.
ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఇప్పటికే పలు రైళ్లను దారి మళ్లించగా, మరికొన్ని రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు వెల్లడించారు. పనులు జరిగే సమయాన్ని బట్టి మరికొన్ని రైలు సర్వీసుల ప్రయాణాల్లో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: కొత్తగా మరో నాలుగు వందేభారత్ రైళ్లు, సికింద్రాబాద్ నుంచి కూడా..