Telangana High court Jobs: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన వారికి ఇది సువర్ణవకాశమనే చెప్పవచ్చు.
తెలంగాణ హైకోర్టు అసిస్టెంట్, టైపిస్ట్, ఇతర ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 1673
ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో తెలంగాణ హైకోర్టు, న్యాయ మంత్రిత్వ శాఖ, సబార్డినేట్ సర్వీస్ పరిధిలో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
తెలంగాణ హైకోర్టు పరిధిలో..
కోర్టు మాస్టర్స్ అండ్ పర్సనల్ సెక్రటరీస్- 12
కంప్యూటర్ ఆపరేటర్ – 11
అసిస్టెంట్స్- 42
ఎగ్జామినర్ – 24
టైపిస్ట్- 12
కాపీయిస్ట్- 16
సిస్టెమ్ అనాలిస్ట్-20
ఆఫీస్ సబార్డినేట్స్ – 75
తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్ పరిధిలో..
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 – 45
టైపిస్ట్-66
కాపీయిస్ట్- 74
జూనియర్ అసిస్టెంట్- 340
ఫీల్డ్ అసిస్టెంట్- 66
ఎగ్జామినర్ -51
రికార్డ్ అసిస్టెంట్- 52
ప్రాసెస్ సర్వర్- 130
ఆఫీస్ సబార్డినేట్ – 479
విద్యార్హత: టెన్ట్, ఇంటర్, డిగ్రీ పాసై ఉండాలి. వర్కింగ్ ఎక్స్ పీరియన్స్ కూడా చూస్తారు.
వయస్సు: 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. (ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.)
దరఖాస్తు ప్రారంభ తేది: 2025 జనవరి 8
దరఖాస్తు చివరి తేది: 2025 జనవరి 31
ఉద్యోగ ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, మెరిట్ లిస్ట్, స్కిల్ టెస్ట్, షార్ట్ హ్యాండ్ ఇంగ్లిష్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.600(ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400 ఉంటుంది.)
అఫీషియల్ వెబ్ సైట్: https://tshc.gov.in/
పరీక్షలు ఏప్రిల్, జూన్ నెలలో జరిగే అవకాశముంది.
టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన వారికి ఇది మంచి అవకాశం. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగాన్ని సాధించండి ఆల్ ది బెస్ట్.