BigTV English

Yantra India Limited : యంత్ర ఇండియా లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు.. అర్హులు ఎవరంటే..?

Yantra India Limited : యంత్ర ఇండియా లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ ఖాళీలు.. అర్హులు ఎవరంటే..?

Yantra India Limited : భారత రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలోని నాగ్‌పూర్‌ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న యంత్ర ఇండియా లిమిటెడ్‌ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని ఆర్డినెన్స్‌, ఆర్డినెన్స్‌ ఎక్విప్‌మెంట్‌ ఫ్యాక్టరీల్లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ శిక్షణకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఐటీఐ, నాన్‌ ఐటీఐ విభాగాల్లో మొత్తం 5,395 ఖాళీలున్నాయి. తెలంగాణలోని మెదక్‌ ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలో 438 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులను విద్యార్హతలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.


ట్రేడ్‌ అప్రెంటిస్‌ : 5,395 ఖాళీలు
ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలు : 3,508
నాన్‌ ఐటీఐ అప్రెంటిస్ ఖాళీలు : 1,887
ట్రేడులు : మెషినిస్ట్‌, ఫిట్టర్‌, టర్నర్‌, వెల్డర్‌,పెయింటర్‌, కార్పెంటర్‌, ఎలక్ట్రీషియన్‌, ఎలక్ట్రోప్లేటర్‌, మెకానిక్‌, ఫౌండ్రీమ్యాన్‌, బాయిలర్‌ అటెండెంట్‌, అటెండెంట్‌ ఆపరేటర్‌ కెమికల్‌ ప్లాంట్‌
ఎంపిక : నాన్‌-ఐటీఐ కేటగిరీలో పదోతరగతి మార్కుల ఆధారంగా
ఐటీఐ కేటగిరీలో పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా

వయసు: 28-03-2023 నాటికి అభ్యర్థుల వయస్సు 15- 24 సంవత్సరాల మధ్య ఉండాలి
వయోపరిమితిలో సడలింపు : ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు
స్టైపెండ్‌ : నెలకు నాన్‌-ఐటీఐ అప్రెంటిస్ లకు రూ. 6 వేలు, ఐటీఐ అప్రెంటిస్ లకు రూ.7 వేలు
దరఖాస్తు రుసుం : జనరల్ అభ్యర్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు రూ.100
ఆన్‌లైన్‌ లో దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: 28-03-2023


వెబ్‌సైట్‌: https://www.yantraindia.co.in/career.php

Tags

Related News

EPFO: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నో కాంపిటేషన్

LIC Bima Sakhi Yojana: మహిళలకు LIC బంపర్ ఆఫర్ – ఉచితంగా 2 లక్షలు ఇవ్వనున్న కేంద్రం

SGPGIMS: 262 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా వేతనం, చివరి తేది ఇదే..

DSC Results: డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్..

Tenth Exams: టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ పద్ధతిలోనే..?

Deputy Manager Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనాలు, అర్హతలు ఇవే

Big Stories

×