Ekalavya Adarsha Gurukul: తెలంగాణ రాష్ట్ర ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 23 ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లలో 2025-26 విద్యా సంవత్సరానికి గానూ ఆరో తరగతి ప్రవేశాలకు ప్రకటన విడుదలైంది. అర్హత ఉన్న విద్యార్థులు ఫిబ్రవరి 16 తేదీలోగా ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎలిజిబిలిటీ ఉన్న గిరిజన, ఆదివాసీ గిరిజన, సంచార గిరిజన, పాక్షిక సంచార గిరిజన, డీనోటిఫైడ్ ట్రైబ్ కేటగిరీలకు చెందిన విద్యార్థులు ప్రవేశాలకు దరఖాస్తు పెట్టుకోవచ్చు.
మొత్తం సీట్ల సంఖ్య: 1380(23 విద్యాలయాలు)
690 మంది బాలురును, 690 మంది బాలికలను సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తుకు చివరి డేట్: 2025 ఫిబ్రవరి 16
ఎగ్జామ్ డేట్: 2025 మార్చి 16
ఎగ్జామ్ ఫలితాలు: 2025 మార్చి 31
ఫస్ట్ ఫేజ్ ప్రవేశాలు: 2025 మార్చి 31
అర్హత: ఆరో తరగతి ప్రవేశాలు పొందాలనుకునే స్టూడెంట్స్ 2023-24 లేదా 2024-25 ఎడ్యుకేషనల్ ఇయర్‌లో ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్‌లో 5వ తరగతి చదివి ఉంటే సరిపోతుంది.
స్టూడెంట్స్ తల్లిదండ్రుల వార్షికాదాయం పట్టణ ప్రాంతమైతే రూ.లక్ష, గ్రామీణ ప్రాంతమైతే రూ.లక్షన్నర మించి ఉండకూడదు.
వయస్సు: 2025 మార్చి 31 నాటికి ఆరో తరగతికి ప్రవేశం పొందాలనుకునే 10-13 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. 2012 మార్చి 31 నుంచి 2015 మార్చి13 మద్య జన్మించి ఉండాలి. దివ్యాంగులకు రెండేళ్ల సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: రాత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను సెలెక్ట్ చేస్తారు.
ఎగ్జామ్: 100 మార్కులకు ప్రశ్నాపత్రం ఉంటుంది. మెంటల్ ఎబిలిటీ(50 ప్రశ్నలు), అరిథ్‌మెటిక్(25 ప్రశ్నలు), తెలుగు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ (25 ప్రశ్నలు) నుంచి ప్రశ్నలు వస్తాయి.
భాష: తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ప్రశ్నలు అడగుతారు.
దరఖాస్తు ఫీజు: రూ.100 ఉంటుంది
దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎగ్జామ్‌లో ఎంపికైన అభ్యర్థులకు ఫ్రీ వసతి, భోజనం, విద్య శిక్షణ అందిస్తారు. సీబీఎస్ఈ సిలబస్ ఉంటుంది. ఆంగ్ల భాషలో బోధన ఉంటుంది.
అఫీషియల్ వెబ్ సైట్: https://tsemrs.telangana.gov.in/
Also Read: Assistant Manager Jobs: బీఈ, బీటెక్ అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ.62,000 జీతం.. పూర్తి వివరాలివే..
అర్హత ఉండి ఆసక్తి ఉన్న విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. విద్యార్థుల భవిష్యత్తుకై తల్లిదండ్రులు ఈ ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేయండి. ఇందులో సీటు వస్తే విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట పడనుంది.