Big Stories

Best Courses After 10th: పదో తరగతి పూర్తి చేశారా..? మీ దారి రహదారి కావాలంటే బెస్ట్ కోర్స్ ఇవే!

Courses After 10th Class: పదో తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు తమ దారెదో నిర్ణయించుకునే అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే పదో తరగతి తర్వాత ఏం చదవాలనేది మీరే ఎంచుకోవాలి. నలుగురితో నారాయణ.. గుంపులో గోవింద అనే కోర్సులు కాకుండా మీ సామర్థ్యం, ఆసక్తులను బట్టి మీకు సరిపోయే కోర్సులను ఎంచుకునే బాధ్యత మీదే కాబట్టి.. ఆచితూచి అడుగులెయ్యడం మంచిది.

- Advertisement -

ఇలా వద్దు..
పది తర్వాత ఏదో ఒక కోర్సులో చేరాలనో, అందరూ అందులో చేరుతున్నారనో.. స్నేహితులు చెప్పారనో.. అమ్మానాన్నల ఆశయమనో.. మీకు పట్టులేని కోర్సును ఎంచుకో వద్దు. ఆ సబ్జెక్టులపై మీకు సరైన పట్టు లేకపోతే మీ చదువును మధ్యలో ఆపేయడానికి లేదా సబ్జెక్టుల్లో ఫెయిల్ అవ్వడానికి ముఖ్య కారణాలు అవుతాయి. మీ కెరీర్‌ను రహదారిగా మార్చుకోవాలంటే కచ్చితంగా మీకు సబ్జెక్టుపై మంచి అవగాహణ, సరైన పట్టు ఉన్న కోర్సునే ఎంచుకోవాలి.

- Advertisement -

Also Read: సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వేలో 733 పోస్టులు.. తొందరగా అప్లై చేసేయండి..!

కొన్ని సూచనలు..

మ్యాథ్స్‌, ఇంజనీరింగ్‌పై ఆసక్తి ఉంటే ఎంపీసీ.. లేదంటే ఎంఈసీ కూడా చేయవచ్చు.
సీఏ, సీఎంఏ చేయాలనుకుంటే ఎంఈసీ.. చరిత్ర, అంశాలపై ఆసక్తి ఉంటే.. హెచ్‌ఈసీలో చేరిపోవచ్చు.
వర్తక, వ్యాపార రంగంపై మనసున్నవారు.. ఎంఈసీ లేదా సీఈసీ తీసుకోవచ్చు. యంత్రాలతో పనిచేయాలనుకునే వారు పాలిటెక్నిక్‌ చేయవచ్చు. తక్కువ వ్యవధిలో స్థిరపడాలని ఆశించేవారు ఒకేషనల్‌ కోర్సులు లేదా ఐటీఐలో చేరవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News