Manager Jobs: సీఏ, డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ పాసైన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(IPPB)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వారంలో రోజుల్లో ఉద్యోగానికి దరఖాస్తు గడువు ముగియనుంది. అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి.
నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. భారీ వేతనంతో కూడిన జీతాలు కల్పించబడును. ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్(IPPB)లో కాంట్రాక్ట్ విధానంలో మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. జనవరి 30న దరఖాస్తు గడువు ముగియనుంది.
ఇందులో మొత్తం ఉద్యోగాల సంఖ్య: 07
ఇందులో డిప్యూటీ జనరల్ మేనేజర్, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, సీనియర్ మేనేజర్, చీఫ్ కంప్లెన్స్ ఆఫీసర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
డిప్యూటీ మేనేజర్ -1
అసిస్టెంట్ జనరల్ మేనేజర్- 1
సీనియర్ మేనేజర్ -3
చీఫ్ కంప్లన్స్ ఆఫీసర్ -1
చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్-1
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో సీఏ, డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ పాస్‌తో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా చూస్తారు.
ఉద్యోగ ఎంపిక విధానం: ఆన్ లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.93,960- రూ.1,73,860 వేతనం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 30

Share