Yuzvendra Chahal: టీమిండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ – ధనశ్రీ వర్మ జంట విడాకులు తీసుకోబోతున్నారు అంటూ గత కొంతకాలంగా ఊహగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ జంట విడాకులు తీసుకోబోతుందని మీడియా నుంచి సోషల్ మీడియా వరకు నిత్యం చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ జంట ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకోవడం, చాహల్ తన ఇంస్టాగ్రామ్ నుండి ధనశ్రీ ఫోటోలను డిలీట్ చేయడంతో ఈ ఊహగానాలు ఊపందుకున్నాయి.
Also Read: Shikhar Dhawan: కుంభమేళాలో శిఖర్ ధావన్.. ఆ అందాల తారతో ఏకంగా?
ఇక అప్పటినుండి ఈ రూమర్స్ వెలవడుతూనే ఉన్నాయి. కానీ ఈ జంట మాత్రం వీరి విడాకుల రూమర్స్ పై స్పందించడం లేదు. దీంతో ఈ రూమర్స్ కి తెరపడడం లేదు. ఈ విషయంలో కొంతమంది చాహాల్ ని టార్గెట్ చేయగా.. మరికొంతమంది ధనశ్రిని టార్గెట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. ఒకానొక సమయంలో తన ప్రతిష్టను పాడు చేయడంపై ధనశ్రీ అసంతృప్తి వ్యక్తం చేయగా.. చాహల్ కూడా ఓ ప్రకటనతో తన వ్యక్తిగత జీవితం గురించి ఎటువంటి ఊహాగానాలు చేయవద్దని రిక్వెస్ట్ చేశాడు.
అయితే మరికొద్ది రోజులలోనే చాహల్ – ధనశ్రీ జంట విడాకులు తీసుకోబోతున్నట్లు సమాచారం. కానీ ఈ జంట ఎందుకు విడిపోతుందనేదానికి ఖచ్చితమైన కారణం మాత్రం తెలియ రాలేదు. అయితే వీరి విడాకుల వ్యవహారంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ రూమర్స్ నేపథ్యంలో తాజాగా చాహల్ సోషల్ మీడియాలో మరో పోస్ట్ చేయడంతో సంచలనంగా మారింది. “నిజమైన ప్రేమ చాలా అరుదు. నా పేరు కూడా అలాంటిదే” అంటూ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు చాహల్. దీంతో చాహల్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.
ఇదిలా ఉంటే.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 19వ తేదీ నుండి ప్రారంభం కాబోయే ఈ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది బీసీసీఐ. కానీ ఈ జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్ చాహల్ ని మాత్రం పక్కన పెట్టారు సెలెక్టర్లు. తన అద్భుతమైన బౌలింగ్ తో భారత జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు చాహల్.
150 కి పైగా ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో ఆడిన ఈ స్టార్ బౌలర్ చాహల్.. 217 వికెట్లు పడగొట్టాడు. ఎంతటి డేంజర్ బ్యాటర్ అయినా ఇతడి బౌలింగ్ లో ఆచితూచి ఆడేవారు. ఎందుకంటే బౌలింగ్ లో అతడి చాకచక్యం, వ్యూహాలను చూసి బ్యాటర్లు భయపడేవారు. అలాంటి ఈ బౌలర్ కెరీర్ ఇప్పుడు దాదాపుగా ముగిసినట్లేనని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
Also Read: Michael Vaughan: టీమిండియాకు డేంజర్ బెల్స్..3-2 గెలుస్తామని మైఖేల్ వాన్ హెచ్చరికలు ?
బీసీసీఐ తో పాటు టీమ్ మేనేజ్మెంట్ తీరు వల్లే యుజ్వేంద్ర చాహల్ కి ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు. గతంలో ఎంతో మంచి ప్రదర్శన చేసిన చాహల్ కి ఇప్పుడు జట్టులో చోటు కల్పించకపోవడం పట్ల భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అటు ఫ్యామిలీ పరంగా, ఇటు కేరీర్ పరంగా చాహల్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడని చెప్పవచ్చు.