IND vs ENG 1st T20: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( IND vs ENG 1st T20 ) జట్ల మధ్య ఇవాళ టి20 సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఈ టి20 సిరీస్ లో టీమిండియా శుభారంభం చేసింది. తొలి మ్యాచ్ లోనే అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది టీమిండియా. ఈ మ్యాచ్లో టీమిండియా ( Team India ) ఏకంగా 7 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టడం జరిగింది. టీమిండియా ఓపెనర్లు సంజు సామ్సన్, అలాగే మరొక ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొట్టారు. అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని టీమిండియా కు విజయాన్ని అందించాడు.
Also Read: Michael Vaughan: టీమిండియాకు డేంజర్ బెల్స్..3-2 గెలుస్తామని మైఖేల్ వాన్ హెచ్చరికలు ?
ఈ మ్యాచ్ లో విజయం సాధించిన నేపథ్యంలో… 5 t20 ల సిరీస్ ను 1-0 ఆధిక్యం తో సిరీస్ ప్రారంభించింది టీమిండియా. ఇక ఈ మ్యాచ్ లో మొదట టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ తీసుకుంది. బౌలింగ్ తీసుకొని సూర్య కుమార్ సేన ( Surya kumar yadav) అద్భుతంగా… ఇంగ్లీష్ ప్లేయర్స్ ను కట్టడి చేయగలిగింది. దీంతో… మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు… నిర్ణీత 20 ఓవర్లలో 10 వికెట్లు నష్టపోయి 132 పరుగులు చేసింది.
ఇంగ్లీష్ బ్యాట్స్మెన్లు గ్రౌండ్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఈ చివరి వరకు…. టీమిండియా బౌలర్ల బంతులు ఎదుర్కోవాలంటే గజ గజ వణికిపోయారు. ఈ దెబ్బకు ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ (Jos Buttler ) ఒక్కడే రాణించగలిగాడు. మిగతా ఆటగాళ్లు ఎవరూ కూడా సింగిల్ డిజిట్ దాటలేదు. అంతేకాదు ఓపెనర్ సాల్ట్, అలాగే డేంజర్ ఆల్ రౌండర్ లివింగ్ స్టోన్… ఇద్దరు కూడా డకౌట్ అయ్యారు.
ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ 44 బంతుల్లో 68 పరుగులు చేసి ఆ జట్టును ఆదుకున్నాడు. ఇందులో రెండు సిక్స్ లు అలాగే 8 ఫోర్లు ఉన్నాయి. అయితే బట్లర్ ను అవుట్ చేసేందుకు వరుణ్ చక్రవర్తి… అదిరిపోయే బంతి వదిలాడు. దీంతో బట్లర్ ఇచ్చిన క్యాచ్ ను తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ అద్భుతంగా పట్టాడు. ఇక ఆ తర్వాత… ఇంగ్లీష్ బ్యాటర్లలో ఎవరు కూడా పెద్దగా రాణించలేదు.
ఇక టీమిండియా బౌలర్లలో అర్ష దీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టగా… ఎక్కువ పరుగులు ఇచ్చినప్పటికీ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టి రాణించాడు. అలాగే వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీసి ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ లకు చుక్కలు చూపించాడు. ఇక మరో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టాడు. రవి బిస్నోయి మాత్రం 4 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు.
Also Read: Yuzvendra Chahal: విడాకులపై చాహల్ సంచలన పోస్ట్.. నా భార్యతో సుఖం లేదు?
అనంతరం 133 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో… టీమిండియా ఆచితూచి ఆడింది. 12.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేరుకుంది. దీంతో ఇంగ్లాండ్ పై మొదటి టి20 మ్యాచ్ లో.. 7 వికెట్ల తేడాతో గ్రాండ్ వికెట్ కొట్టింది సూర్య కుమార్ సేన. టీమిండియా బ్యాట్స్మెన్లలో సంజు 26 పరుగులతో రాణించాడు. అనంతరం అభిషేక్ శర్మ ( Abhishek Sharma ) 34 బంతుల్లో 79 పరుగులు చేసి రఫ్పాడించాడు. అలాగే సూర్య కుమార్ డకౌట్ కాగా… తిలక్ వర్మ 19 పరుగులతో రాణించాడు. మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అభిషేక్ శర్మకు వచ్చింది. ఇక టి20 మ్యాచ్ శనివారం జరగనుంది.