AFMS Jobs: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఏదైనా రాష్ట్ర వైద్య మండలి ఎంసీఐ/ఎన్‌బీఈ/ఎన్‌ఎంసీ నుంచి శాశ్వత రిజిస్ట్రేషన్ కలిగి ఉండి లేదా రాష్ట్ర వైద్య మండలి ఎంసీఐ/ఎన్‌బీఈ/ఎన్‌ఎంసీ ద్వారా గుర్తింపు పొందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్లకు ఇది మంచి అపార్చునిటీ అని చెప్పవచ్చు. ఆర్మ్ డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెన్ నుంచి పలు ఉద్యోగాలను నింపేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
ఢిల్లీ, ఆర్మ్ డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(AFMS) మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారందరూ ఈ మెడికల్ ఆఫీసర్ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. మే 12వ తేదీ వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.
మొత్తం వెకెన్సీల సంఖ్య: 400
ఆర్మ్ డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ లో రెండు రకాల వెకెన్సీలు ఉన్నాయి. మెడికల్ ఆఫీసర్ (మేల్), మెడికల్ ఆఫీసర్ (ఫీమేల్) ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.
పోస్టులు – ఖాళీలు:
మెడికల్ ఆఫీసర్ (మేల్) : 300 ఉద్యోగాలు
మెడికల్ ఆఫీసర్ (ఫీమేల్) : 100 ఉద్యోగాలు
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 19 (నిన్నటి నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది)
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 12
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో అభ్యర్థులు జాతీయ వైద్య కమిషన్ చట్టం-2019 ప్రకారం వైద్య అర్హతను కలిగి ఉండాలి. ఏదైనా రాష్ట్ర వైద్య మండలి/ఎంసీఐ/ఎన్‌బీఈ/ఎన్‌ఎంసీ నుంచి శాశ్వత రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి. రాష్ట్ర వైద్య మండలి ఎంసీఐ/ఎన్‌బీఈ/ఎన్‌ఎంసీ ద్వారా గుర్తింపు పొందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత ఉన్న వారు అప్లై చేసుకోండి.
వయస్సు: అప్లై చేసుకునే వారు 32 ఏళ్ల మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.200 ఫీజు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
జీతం: ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.1లక్షకు పైగా వేతనం ఉంటుంది. మరి అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు అందరూ ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోండి.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://join.afms.gov.in/
అర్హత ఉండి ఆసక్తి ఉన్న వారు ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. రూ.1లక్షకు పైగా వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ జాబ్స్ కు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
Also Read: UPSC Recruitment: యూపీఎస్సీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. జస్ట్ ఇంటర్వ్యూ ద్వారానే జాబ్
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఖాళీల సంఖ్య: 400
దరఖాస్తుకు చివరి తేది: మే 12
Also Read: SBI Recruitment: ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు.. జీతం రూ.48,480