OTT Movie : లవ్ స్టోరీ లేకుండా సినిమాలను ఊహించుకోలేము. కంటెంట్ ఏదైనా, ఒక లవ్ స్టోరీని మాత్రం చూపిస్తుంటారు మేకర్స్. అంతలా లవ్ స్టోరీలకు అలవాటుపడిపోయారు మన ప్రేక్షకులు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, IAS కావాలనుకునే ఒక ప్రేమ జంట చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
1990 లో దద్దు ఠాకూర్ ఒక కాలేజ్ లో చదువుతుంటాడు. దద్దు చదువులో చాలా చురుకుగా ఉంటాడు. ఇతను IAS ఆఫీసర్ కావాలనే ఆశయంతో కష్టపడి చదువుతుంటాడు. మరోవైపు ఝులన్ అనే అమ్మాయిని కూడా దద్దు ప్రాణంగా ప్రేమిస్తుంటాడు. ఆమె కూడా IAS కావాలని కలలు కంటూ ఉంటుంది. వీరి లవ్ స్టోరీ చిన్నప్పటి నుండి కొనసాగుతుంది. అయితే చిన్నపాటి గోడవలతో, అప్పుడప్పుడూ దూరంగా కూడా ఉండేవారు. మళ్ళీ కాలసిపోయే వాళ్ళు. ఒకసారి మండల్ కమిషన్ సిఫారసులు (కుల రిజర్వేషన్లు) అమలు కావడంతో, దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగుతాయి. అలహాబాద్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడైన దద్దు, లోహా సింగ్ అనే రాజకీయ నాయకుడి ప్రభావంతో ఈ నిరసనల్లో చురుకుగా పాల్గొంటాడు.
లోహా విద్యార్థుల మద్దతుతో MLA కావాలనే లక్ష్యంతో ఉంటాడు. అతనికి మద్దతుగా, దద్దు రాజకీయ నిరసనల్లో మునిగిపోతాడు. ఈ క్రమంలో ఝులన్‌తో అతని సంబంధం ఒడిదొడుకులను ఎదుర్కొంటుంది. ఝులన్‌ను ఆమె తండ్రి కట్టడి చేయడం, ఆమె వివాహం గురించి ఒత్తిడి చేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. దద్దు తన IAS కలను వదులుకుని, రాజకీయాల్లో ఎక్కువగా సమయం గడుపుతాడు. ఇది అతని జీవితంలో విషాదకరమైన మలుపులకు దారి తీస్తుంది. చివరికి దద్దు, ఝులన్ ల లవ్ స్టోరీ ఏమౌతుంది ? దద్దు రాజకీయాల్లో ఎదుర్కునే సమస్యలు ఏమిటి ? అతని జీవితం ఎటు వెళ్తుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఇదేం దిక్కు మాలిన పని… బొమ్మకు ముద్దు పెడుతూ… అదిరిపోయే హారర్ థ్రిల్లర్
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘హుర్దంగ్’ (Hurdang). 2022 లో విడుదలైన ఈ సినిమాకి నిఖిల్ నగేష్ భట్ దర్శకత్వం వహించారు. ఇందులో సన్నీ కౌశల్, నుష్రత్ భరూచా, విజయ్ వర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ 1990 లలో అలహాబాద్ లో జరిగిన మండల్ కమిషన్ నిరసనల నేపథ్యంలో ఈ స్టోరీ తిరుగుతుంది. వీటి చుట్టూనే ఒక లవ్ స్టోరీ కూడా నడుస్తూ ఉంటుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.