BigTV English

Apple iPhone: తగ్గేదేలే.. ట్రంప్‌కు యాపిల్ సీఈవో ఝలక్.. ఇండియాకే ప్రాధాన్యం

Apple iPhone: తగ్గేదేలే.. ట్రంప్‌కు యాపిల్ సీఈవో ఝలక్.. ఇండియాకే ప్రాధాన్యం

Apple iPhone: అమెరికాలో ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయమై పెద్ద చర్చ జరుగుతోంది. ప్రపంచంలో అత్యంత విలువైన టెక్నాలజీ కంపెనీలలో ఒకటైన యాపిల్ CEO టిమ్ కుక్ చేసిన తాజా వ్యాఖ్యలు అందరిలోనూ ఆసక్తి కలిగించాయి. అమెరికాలో అమ్ముడవుతున్న ఎక్కువశాతం ఐఫోన్లకు ‘భారతదేశమే’ మూల దేశంగా నమోదు అవుతోంది. ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై 25% టారిఫ్‌లు విధించినా, యాపిల్ మాత్రం భారత్‌లో తయారీ కొనసాగిస్తున్నదంటే, ఇది భారతదేశ టెక్నాలజీ రంగానికి ఓ భారీ గౌరవం. ఇది కేవలం వాణిజ్యం కాదు… భారత్, అమెరికా మధ్య పెరుగుతున్న వ్యూహాత్మక సంబంధాలకు బలమైన ఉదాహరణ కూడా అని టిమ్ కుక్ తెలిపారు.


అయితే ఇదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం భారత్‌పై 25 శాతం రివర్సల్ టారిఫ్‌లు విధించారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టొద్దని, యూఎస్‌లోనే తయారీ జరగాలని టిమ్ కుక్‌ను కోరారు కూడా. కానీ టిమ్ కుక్ మాత్రం తాను తీసుకున్న వ్యూహాన్ని మార్చలేదు. ఎందుకంటే యాపిల్ ఉత్పత్తుల్లో చాలావరకు సెక్షన్ 232 చట్ట పరిధిలోకి వస్తున్నాయి. దీని ప్రకారం, కొన్ని వస్తువులపై టారిఫ్‌లు వర్తించవు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, సెమీకండక్టర్లు ఇవే టారిఫ్‌ల నుండి మినహాయింపు పొందుతున్నవి. అందుకే, ట్రంప్ విధించిన టారిఫ్‌లు యాపిల్ మీద పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేదు.

మరోవైపు, భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. కేవలం మూడు నెలల్లోనే ఇండియా అమెరికాకు 25 బిలియన్ డాలర్లకు పైగా వస్తువులు ఎగుమతి చేసింది. ఇది గతేడాది ఇదే కాలంతో పోల్చితే దాదాపు 23 శాతం వృద్ధి. రెండూ కలిసి చేసిన వ్యాపార విలువ 86 బిలియన్ డాలర్లకు చేరింది. యాపిల్ పరంగా చూస్తే, 2025 జూన్ లో ప్రతి మూడు నెలలకు ఒకసారి కంపెనీ 94 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. లాభం 23 బిలియన్ డాలర్లకు చేరింది. ముఖ్యంగా ఐఫోన్ అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. భారతదేశంలో మాత్రమే కాకుండా, బ్రెజిల్, దక్షిణాసియా, మిడిల్ ఈస్ట్ లాంటి మార్కెట్లలో డబుల్ డిజిట్ వృద్ధి నమోదైంది.


టిమ్ కుక్ మరో ముఖ్యమైన విషయం చెప్పినది – భారత్‌లో తమ రిటైల్ వ్యాపారాన్ని విస్తరిస్తామని. ఇప్పటికే వారు ఆన్‌లైన్ స్టోర్‌లు ప్రారంభించారు. ఇప్పుడు నేరుగా స్టోర్లు కూడా తెరవబోతున్నారు. దీనితో భారత్‌లో యాపిల్ ఉనికి మరింత పెరగనుంది. ఈ మొత్తం వ్యవహారం చూస్తే… భారత్ యాపిల్ వంటి దిగ్గజానికి కీలకమైన హబ్‌గా మారుతున్నది స్పష్టమవుతుంది. టెక్నాలజీ రంగంలో భారత్‌కు ఇదొక గొప్ప అవకాశం కూడా.

Related News

Bank Holidays: ఏంటీ ఆ మూడు రోజులు బ్యాంక్ పనిచేయవా.. ముందుగా ప్లాన్ చేసుకోండి ఇలా..

Jio Mart vs D-Mart: రిలయన్స్ ఫ్రెష్, డి-మార్ట్.. దేనిలో ధరలు తక్కువ, ఎందుకు?

Gold Mines: ఆ ప్రాంతంలో లక్షల టన్నుల బంగారం.. తవ్వే కొద్ది బయటపడుతోన్న గోల్డ్.. ఎక్కడో తెలుసా?

Jio Offers: ఎగిరి గంతేసే వార్త.. జియో తక్కువ ధరకే అదిరిపోయే బెనిఫిట్స్

D-Mart: డి-మార్ట్‌ లో అత్యంత చౌకగా లభించే వస్తువులేంటీ? ఎంత శాతం డిస్కౌంట్ ఇస్తారు?

PAN 2.0: పాన్ 2.0.. అప్‌డేట్ వెర్షన్, అయితే ఏంటి?

Big Stories

×