నేషనల్ కోఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (NCDC) విజయవాడ విభాగం నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ (ఫిషరీస్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మత్స్య పరిశ్రమ రంగంలో నైపుణ్యం కలిగిన యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ నియామక ప్రక్రియను చేపట్టింది. మొత్తం ఐదు ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు మత్స్య సంపద అభివృద్ధి.. సహకార రంగంలో కీలక బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
విద్యార్హత: ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విద్యార్హతల విషయంలో నిబంధనలు పాటించాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిషరీస్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) పూర్తి చేసి ఉండాలి. విద్యార్హతతో పాటు సంబంధిత విభాగంలో పని చేసిన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత లభిస్తుంది.
వయస్సు: అభ్యర్థుల వయోపరిమితిని పరిశీలిస్తే.. 45 ఏళ్లు మించకూడదని సంస్థ స్పష్టం చేసింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. దేశంలోని మత్స్య పరిశ్రమ విస్తరణలో భాగంగా చేపడుతున్న ఈ నియామకాలు అభ్యర్థుల వృత్తిపరమైన ఎదుగుదలకు మంచి వేదికగా నిలుస్తాయి.
వేతనం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 50,000 గౌరవ వేతనం చెల్లిస్తారు.
సెలక్షన్ ప్రాసెస్: అభ్యర్థుల విద్యార్హతలు.. అనుభవం ఆధారంగా దరఖాస్తులను తొలుత షార్ట్ లిస్ట్ చేస్తారు. అనంతరం మెరిట్ సాధించిన వారిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఇంటర్వ్యూలో అభ్యర్థి చూపే ప్రతిభ.. వృత్తిపరమైన పరిజ్ఞానం ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఎంపికైన వారు విజయవాడ కేంద్రంగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది. సహకార రంగంలో మత్స్యకారుల అభివృద్ధికి తోడ్పడే ప్రాజెక్టుల పర్యవేక్షణలో వీరు కీలక పాత్ర పోషిస్తారు.
ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి మే 4వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోరని అధికారులు స్పష్టం చేశారు.
అభ్యర్థులు తమ దరఖాస్తులతో పాటు విద్యార్హత పత్రాలు.. అనుభవ ధృవీకరణ పత్రాలను నిర్ణీత ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేయాలి. తక్కువ సమయంలోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు. మత్స్య శాస్త్రంలో ఉన్నత విద్య పూర్తి చేసిన వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. మరిన్ని వివరాల కోసం ఎన్సీడీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.ncdc.in/
ALSO READ: సీబీఎస్ఈ 12వ తరగతి రిజల్ట్స్ ఎప్పుడంటే..? తొలిసారిగా ఆన్ స్క్రీన్ మార్కింగ్ సిస్టమ్