E-Paper
Advertisement

బచ్చన్నపేటలో వరుస విషాదాలు.. ఈత సరదాకు మరో ప్రాణం బలి!

బచ్చన్నపేటలో వరుస విషాదాలు.. ఈత సరదాకు మరో ప్రాణం బలి!
Advertisement

Drowning Deaths: స్వేచ్ఛ బ్యూరో: బచ్చన్నపేట మండలంలో 48 గంటల వ్యవధిలో రెండు నీటి ప్రమాదాలు చోటు చేసుకోవడంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈత సరదా మరో ప్రాణాన్ని బలిగొంది. మండల కేంద్రంలో ఏనుగుల ప్రశాంత్ అనే యువకుడు రాజన్న బావిలో మునిగి గల్లంతై, మరుసటి రోజు ఉదయం మృతదేహం లభించిన విషయం మరవకముందే మరో ఘటన చోటు చేసుకుంది.

వికలాంగుడు ఈత కొట్టే క్రమంలో..

రామచంద్రపురం గ్రామానికి చెందిన చీర కరుణాకర్ అనే వికలాంగుడు ఈత కొట్టే క్రమంలో అకస్మాత్తుగా తుమ్మల బావి నీటిలో మునిగి గల్లంతయ్యాడు. ఎంతకూ పైకి రాకపోవడంతో మృతి చెందినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. ప్రస్తుతం వరకు మృతదేహం లభ్యం కాలేదు. ఘటనపై గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Also Read: పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. మే నెలలో ముఖ్య తేదీలివే

పోలీసులు అప్రమత్తం..

వరుస ప్రమాదాల నేపథ్యంలో బచ్చన్నపేట మండల ప్రజలను పోలీసులు అప్రమత్తం చేశారు. బావులు, నీటి వనరుల వద్దకు వెళ్లవద్దని, లోతు తెలియని చోట ఈత, డైవింగ్ వంటి సాహసాలు ప్రాణాంతకమని హెచ్చరించారు. రెండు రోజుల్లో రెండు ప్రాణాలు కోల్పోవడంతో బచ్చన్నపేట మండలంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Advertisement

Also read; తెలంగాణ రైల్వే రంగంలో చారిత్రాత్మక అడుగు.. కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం..!

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×