నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.. నార్త్ ఇండియా టెక్నికల్ కన్సల్టెన్సీ ఆర్గనైజేషన్ లిమిటెడ్ (NITCON) ఢిల్లీ మంచి అవకాశాన్ని కల్పించింది. కాంట్రాక్ట్ విధానంలో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం 100 ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో సివిల్ విభాగంతో పాటు ఎలక్ట్రికల్ మెకానికల్ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఏప్రిల్ 8వ తేదీ లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తి కలిగన వారు అప్లై చేసుకోండి.
మొత్తం పోస్టులు సంఖ్య: 100
మొత్తం 100 పోస్టులలో జూనియర్ ఇంజినీర్ సివిల్ విభాగానికి అత్యధికంగా 80 ఖాళీలను కేటాయించారు. మిగిలిన 20 పోస్టులను జూనియర్ ఇంజినీర్ ఎలక్ట్రికల్ మెకానికల్ విభాగాలకు కేటాయించినట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. టెక్నాలజీ రంగంలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు ఇవి ఉత్తమ అవకాశాలుగా చెప్పవచ్చు.
విద్యార్హత: సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతతో పాటు అభ్యర్థులకు సంబంధిత రంగంలో పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
వయస్సు: వయోపరిమతి విషయానికి వస్తే 2026 ఏప్రిల్ 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఇతర రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
జీతం: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 55,932 వేతనం అందుతుంది.
సెలెక్షన్ ప్రాసెస్: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) ఆధారంగా జరుగుతుంది. ఈ పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ద్వారా అభ్యర్థులను తుది ఎంపిక చేస్తారు. సాంకేతిక అంశాలపై పట్టు ఉన్న వారికి ఈ పరీక్షలో విజయం సాధించడం సులభం కానుంది.
దరఖాస్తు ప్రక్రియ: అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ. 885 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ దివ్యాంగుల కేటగిరీ అభ్యర్థులకు రూ. 531 ఫీజుగా నిర్ణయించారు. దరఖాస్తు సమర్పించడానికి 2026 ఏప్రిల్ 8వ తేదీని గడువుగా నిర్ణయించారు.
అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచి చూడకుండా ముందే దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవడం ఉత్తమం.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించవచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://nitcon.org/Career/
చివరి తేది: ఏప్రిల్ 8
ALSO READ: నిరుద్యోగులకు సువర్ణవకాశం.. డిగ్రీ అర్హతతో 1000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్