Telangana Govt Jobs: తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో త్వరలోనే భారీ ఉద్యోగ నోటిఫికేషన్ ను విడుదల చేసేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. మహిళా శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీలను భర్తీ చేసేందుకు రేవంత్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ALSO READ: Jobs in Indian Railways: శుభవార్త.. రైల్వేలో 32,438 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోనివారికి మరో అవకాశం..
దీనికి సంబంధించిన ఫైల్ పై మంత్రి సీతక్క ఇవాళ సైన్ చేశారు. దీంతో త్వరలోనే 6399 అంగన్వాడీ టీచర్లు, 7837 హెల్పర్ల పోస్టులు భర్తీ చేయనున్నారు. అంటే మొత్తం 14,236 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం రెడీగా ఉంది. ఎన్నికల కోడ్ ముగియగానే దీనికి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదల కానున్నాయ. అయితే, ఈ నోటిఫికేషన్లను జిల్లాల వారీగా కలెక్టర్లు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
ALSO READ: Sankrantiki Vastunnam : ఓటీటీ కంటే ముందుగానే టీవీల్లోకి.. డేట్ అండ్ టైం వచ్చేసింది..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత ఇంత భారీ నోటిఫికేషన్ రాలేదు. ఇంత భారీ మొత్తంలో అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల ఉద్యోగాలను భర్తీ చేయడం ఇది మొదటి సారి ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తే రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలు మరింత పటిష్టంగా గర్భిణీ స్త్రీలకు, చిన్నారులకు సేవలు అందుతాయని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.