BigTV English

Mazaka Movie : రావు రమేష్‌ vs సందీప్ కిషన్… ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది..?

Mazaka Movie : రావు రమేష్‌ vs సందీప్ కిషన్… ఈ ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది..?

Mazaka Movie : సందీప్ కిషన్… మజాకా అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రాబోయే శుక్రవారం ( ఫిబ్రవరి 26న) ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న టైంలో… ఈ మూవీ టీం గురించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు దారి తీస్తుంది. ఈ మూవీలో నటించిన సందీప్ కిషన్‌కు ఓ సీనియర్ నటుడితో చెడిందట. ఆ సీనియర్ నటుడిని సందీప్ కిషన్ చాలా దూరంగా పెట్టాడని తెలుస్తుంది.


సందీప్ కిషన్‌తో తగాదా పెట్టుకున్న ఆ సీనియర్ నటుడు ఎవరు??
వీరి ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది..?
అనేది ఇప్పుడు చూద్ధాం…

త్రినాధ రావు నక్కిన డైరెక్షన్‌లో వస్తున్న మూవీ మజాకా. ఈ నెల 26న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. నిజానికి ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ, సంక్రాంతి బరిలో పెద్ద సినిమాలు ఉండటంతో… కాస్త వెనక్కి తగ్గి ఫిబ్రవరి 26న రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. సంక్రాంతికి మూవీని రిలీజ్ చేయలేదు కానీ, ఓ టీజర్‌ను అయితే వదిలారు. ఆ టీజర్‌కు పాజిటివ్ టాక్ వచ్చింది. ముఖ్యంగా సందీప్ కిషన్ – రావు రామేష్ మధ్య సాగే ట్రాక్ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.


రావు రామేష్‌తో హీరో గొడవ..?

ఈ విషయం పక్కన పెడితే… ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ వార్త వినిపిస్తుంది. ఈ మూవీలో కీలక పాత్రల్లో కనిపించిన సందీప్ కిషన్ – రావు రామేష్ మధ్య చెడిందట. వీళ్లు ఇద్దరు కలిసి ఒక చోట అసలు ఉండలేకపోతున్నారట. రావు రమేష్‌ను సందీప్ కిషన్ పూర్తిగా దూరం పెట్టాడని సమాచారం.

నో ప్రమోషన్స్..?

వీరి ఇద్దరి మధ్య జరిగిన దాని వల్ల… ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయడం లేదని తెలుస్తుంది. రావు రామేష్ వస్తే తాను ప్రమోషన్స్ రాను అని హీరో సందీప్ కిషన్ అంటున్నాడని తెలుస్తుంది. వీరి మధ్య ఏం జరిగింది అనేది క్లారిటీ లేదు. కానీ, ఇద్దరు కాస్త పర్సనల్‌గానే పోయారని సమాచారం.

రావు రామేష్ కీ రోల్… 

మజాకా మూవీలో రావు రామేష్ కీలక పాత్ర చేస్తున్నాడు. హీరో తర్వాత ఎక్కవు సీన్స్ ఉన్నవి రావు రామేష్ పాత్రకే. మూవీలో హీరో సందీప్ కిషన్‌కు తండ్రి పాత్రలో రావు రామేష్ నటస్తున్నాడు. హీరో లవ్ స్టోరీతో పాటు… హీరో తండ్రి కూడా లవ్ పడటం అనేది మూవీ కాన్సెప్ట్. కాబట్టి.. ఇద్దరికీ ష్క్రీన్ షేరింగ్ టైం దాదాపు సమానంగా ఉండబోతుంది. దీంతో మూవీకి రావు రామేష్ చాలా అవసరం. అలాంటి వ్యక్తి ప్రమోషన్స్ కు దూరంగా ఉండటంతో… వీరి మధ్య చెడింది అనే వార్తలకు బలం చేకూరిస్తుంది.

సందీప్ ఎక్ట్స్ సాంగ్..?

అలాగే… మజాకా మూవీలో సందీప్ కిషన్ స్పేషల్‌గా ఓ సాంగ్ చేసుకున్నాడట. ఈ సాంగ్‌ మూవీ చివరలో వస్తుందని తెలుస్తుంది. ప్రొడ్యూసర్‌కు ఇష్టం లేకున్నా… హీరోనే ఈ సాంగ్ చేసుకున్నాడనే టాక్ కూడా ఉంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×