IAF Recruitment 2022 : కేంద్ర ప్రభుత్వం అగ్నిపథ్ యోజన కింద అగ్నివీర్ వాయులో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అగ్నివీర్ సంక్షిప్త ఇంటేక్ అర్హత గల అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతోంది. ఈ పోస్టలుకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్దులు మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. మూడేళ్ల డిప్లోమా ఇంజనీరింగ్ చేసిన అభ్యర్ధులు, తత్సమాణ డిగ్రీ కలిగి ఉన్న వారు కూడా దరఖాస్తులు చేసుకోవచ్చు. దీంతో పాటు శారీరక ధారుడ్యం, మెడికల్ ఫిట్‌నెస్ నోటిఫికేషన్‌లో అడిగినంత ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ ‘నవంబర్ మొదటి వారం’ 2022 నుంచి ప్రారంభమవుతుంది. అనలైన్‌లో అగ్నిపథ్ వాయుకు సంబంధించిన https://agnipathvayu.cdac.in/ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. మూడు ఫేజ్‌లలో ఎంపిక విధానం ఉంటుంది. ఫేజ్ 1లో ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించి తరువాత ఫేజ్ 2లో ఫిజికల్ టెస్ట్ పెడతారు. ఇక ఫేజ్ 3లో మెడికల్ ఫిట్‌నెస్ ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష జనవరి 2023లో ఉండనుంది.
దరఖాస్తు ప్రారంభం : నవంబర్ మొదటివారం, 2022
దరఖాస్తు చివరితేది : జనవరి 2023
వెబ్సైట్ : https://agnipathvayu.cdac.in/