Pawan vs Vijay Devarakonda : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అయితే పవన్ కళ్యాణ్ రీసెంట్ టైమ్స్ లో సినిమాలు మీద ఆసక్తిని పూర్తిగా తగ్గించేశారు. కంప్లీట్ గా రాజకీయాల్లో బిజీ అయిపోవడం వలన సినిమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టడం లేదు. ఇకపోతే గబ్బర్ సింగ్ సినిమాలో నాతో ఎవరూ పోటీ కాదు నాకు నేనే పోటీ నాతో నాకే పోటీ అనే ఒక డైలాగ్ రాసాడు హరీష్ శంకర్. ఇది పవన్ కళ్యాణ్ వాస్తవిక జీవితానికి కూడా కరెక్ట్ అనిపిస్తుంది. పలు సందర్భాలలో రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ ని ప్రశంసిస్తూ ట్వీట్స్ పెట్టారు. ఒక టైం లో పవన్ కళ్యాణ్ రామ్ గోపాల్ వర్మపై స్పందించేసరికి అప్పుడు నుంచి పవన్ కళ్యాణ్ ని నెగిటివ్ గా చూడడం ప్రారంభించాడు రామ్ గోపాల్ వర్మ. అర్జున్ రెడ్డి సినిమా హిట్ అయిన తర్వాత విజయ్ దేవరకొండను పవన్ కళ్యాణ్ తో కూడా పోల్చాడు. ప్రస్తుతం ఆ టాపిక్ ఎందుకు వచ్చింది అంటే హరిహర వీరమల్లు, కింగ్డమ్ సినిమాలు రిలీజ్ వలన.
మరో ఫ్యాన్ వార్
హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించిన ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు. చాలా ఏళ్లు తర్వాత పవన్ కళ్యాణ్ ఒక స్ట్రైట్ ఫిలిం చేస్తున్నాడు అని అభిమానులందరికీ సంతోషం అనిపించింది. కానీ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఇప్పుడు రిలీజ్ కావలసిన సినిమా ఇప్పటికీ పోస్ట్ పోన్ అవుతూనే ఉంది. ఈ సినిమాను మొదట మే 30న విడుదల చేస్తాము అని అనౌన్స్ చేశారు. అదే రోజున విజయ్ దేవరకొండ నటిస్తున్న కింగ్డమ్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే సినిమాకి ఉన్న కొంచెం పెండింగ్ వర్క్ వలన హరిహర వీరమల్లు సినిమా జూన్ 12న రిలీజ్ కు సిద్ధమవుతుంది. ఈ తరుణంలో కొంతమంది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ని ఆ డేట్ కి సినిమా విడుదల చేయమనండి అంటూ ఫ్యాన్ వార్స్ మొదలుపెట్టారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య వార్ నడుస్తుంది.
నిర్మాతలకు క్లారిటీ ఉంది
ఇకపోతే మహేష్ బాబు జనతా గ్యారేజ్ సినిమా ఈవెంట్లో చెప్పినట్లు మేము మేము బాగానే ఉంటాము, మీరే ఇంకా బాగుండాలి. హీరోలు బానే ఉన్నారు. నిర్మాతలే సోలో రిలీజ్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. హరి హర వీరమల్లు మే 30 కి వస్తే… కింగ్డమ్ మూవీ వాయిదా వేసుకుంటామని నిర్మాత నాగ వంశీ గతంలోనే ప్రకటించాడు. అయినా, ఇప్పుడు ఫ్యాన్స్ ఆగడం లేదు. ఇక నిర్మాత నాగ వంశీ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కు మంచి రెస్పెక్ట్ ఇస్తాడు. అలానే హీరో గారు ఆ డేట్ కి వస్తే మేము తప్పుకుంటామని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. కానీ ఇవేవీ కూడా ఫ్యాన్స్ బుర్రకు ఎక్కడం లేదు.
Also Read : Sri Vishnu Single: ఛాన్స్ అంటే నీదేనయ్యా.. కుర్రాళ్ల క్రష్ తో లిప్ లాక్..సీన్ మాములుగా వుండదుగా..!