E-Paper
Advertisement

NTPC Recruitment: రూ.2,40,000 జీతంతో ఉద్యోగాలు.. ఇలాంటి జాబ్ కొడితే డబ్బులే డబ్బులు, పూర్తి వివరాలివే

NTPC Recruitment: రూ.2,40,000 జీతంతో ఉద్యోగాలు.. ఇలాంటి జాబ్ కొడితే డబ్బులే డబ్బులు, పూర్తి వివరాలివే
Advertisement

నిరుద్యోగ అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం.. న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న దేశంలో అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉన్న అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్.. బీటెక్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ఫీజు, తదితర అంశాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

ఎన్టీపీసీ గ్రీన్ కెమికల్ విభాగంలో ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన పలు పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సీనియర్ మేనేజర్ తో పాటు ఇంజినీర్ కేటగిరీల్లో మొత్తం 8 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో తమ సర్టిఫికెట్స్ సమర్పించాల్సి ఉంటుంది.

Advertisement

వెకెన్సీల సంఖ్య: 8

విభాగాల వారీగా..

Advertisement

సీనియర్ మేనేజర్ (గ్రీన్ కెమికల్) విభాగంలో 4 పోస్టులు ఉన్నాయి. అలాగే ఇంజినీర్ (గ్రీన్ కెమికల్) విభాగంలో 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో కెమికల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. సంబంధిత రంగంలో పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత లభిస్తుంది.

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. సీనియర్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 44 ఏళ్ల లోపు ఉండాలి. ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థుల వయస్సు 32 ఏళ్లకు మించరాదు

జీతం:  ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి వేతనం భారీగా ఉంటుంది.. సీనియర్ మేనేజర్ స్థాయి అధికారులకు నెలకు రూ. 90,000 నుంచి గరిష్ఠంగా రూ. 2,40,000 వరకు జీతం లభిస్తుంది. ఇంజినీర్ స్థాయి అధికారులకు రూ. 50,000 నుంచి ప్రారంభమై రూ. 1,60,000 వరకు నెలవారీ వేతనం అందుతుంది.

ఎంపిక ప్రక్రియ: అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరగనుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారి ప్రొఫైల్స్ బేస్ చేసుకుని ముందుగా షార్ట్‌లిస్ట్ చేస్తారు. అనంతరం స్క్రీనింగ్ టెస్ట్ లేదా రాత పరీక్ష నిర్వహిస్తారు. వీటిలో మెరిట్ సాధించిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. చివరిగా మెడికల్ టెస్ట్ నిర్వహించి పోస్టులకు ఎంపిక చేస్తారు.

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మార్చి 16 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేది: మార్చి 16

కేంద్ర ప్రభుత్వ సంస్థలో కెరీర్ ప్రారంభించాలని భావించే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. చివరి నిమిషంలో సర్వర్ ఇబ్బందులు రాకుండా అభ్యర్థులు ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://careers.ntpc.co.in/

ALSO READ: RRB Group D: భారీ గుడ్ న్యూస్.. 22,195 ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంపు, లాస్ట్ డేట్ ఎప్పుడంటే..?

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×