Hrithik Roshan:బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్(Hrithik Roshan) కి గ్రీక్ గార్డ్ అనే పేరు ఉంది.ఒకప్పుడు ఎంతోమంది అమ్మాయిలు ఈయనను గ్రీకువీరుడు అని పిలుచుకునేవారు. అమ్మాయిల కలల రాకుమారుడుగా పేరున్న హృతిక్ రోషన్ కి పెళ్లైన సమయంలో చాలామంది అమ్మాయిలు షాక్ అయిపోయారు. ఇంకొంత మందికేమో హార్ట్ బ్రేక్ అయినంత పనైంది. అయితే అలాంటి హృతిక్ రోషన్ మొదట సుస్సానే ఖాన్ (Sussane Khan) ని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. అలా 2000వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్న ఈ జంట 2014లో విడాకులు తీసుకుంది. అయితే పెళ్లికి ముందే గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట, 14 ఏళ్ల తర్వాత ఎందుకు విడాకులు తీసుకుందో అని చాలామంది ఆశ్చర్యపోయారు. ఇప్పటికి కూడా ఈ జంట విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటో బయటపడలేదు. అయితే తాజాగా కొడుకు విడాకుల వార్తలపై మొదటిసారి స్పందించారు హృతిక్ రోషన్ తండ్రి నటుడు రాకేష్ రోషన్(Rakesh Roshan).
కొడుకు – కోడలు విడాకులపై స్పందించిన రాకేష్ రోషన్..
రీసెంట్ గా ఓ బాలీవుడ్ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాకేష్ రోషన్ (Rakesh Roshan) కి హృతిక్ రోషన్ విడాకుల గురించి షాకింగ్ ప్రశ్న ఎదురైంది. అయితే కొడుకు విడాకుల గురించి రాకేష్ రోషన్ మాట్లాడుతూ..”అసలు వాళ్ళు ఎందుకు విడాకులు తీసుకున్నారో మాకు కూడా తెలియదు. ప్రేమించుకుంది వాళ్లే.. విడాకులు తీసుకుంది వాళ్లే..అందులో మా ప్రమేయం లేదు. ఇక విడాకులు తీసుకున్నప్పటికీ మా కోడలు.. మాకు కోడలు కాకుండా పోదు. సుస్సానే ఖాన్ ఇప్పటికీ కూడా మా ఇంటికి తరచూ వస్తూ పోతూ ఉంటుంది. మేము ఇప్పటికీ మా ఇంటి మనిషిగానే సుస్సానే ఖాన్ ను ట్రీట్ చేస్తాము. ఎప్పటికీ ఆమె మా కుటుంబ సభ్యురాలే.. అలాగే ప్రేమించి పెళ్లి చేసుకుంది వాళ్లే..కాబట్టి గొడవలు వచ్చినప్పుడు వాటిని సాల్వ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా వారిదే. అందులో మా ఇన్వాల్వ్మెంట్ లేదు” అంటూ రాకేష్ రోషన్ చెప్పుకొచ్చారు. అలాగే కొడుకు కూతురు గురించి మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి నా కూతురు సునయనా, నా కొడుకు హృతిక్ రోషన్ ఇద్దరూ నేనంటే భయపడతారు.
ఇద్దరూ ఇతరులతో డేటింగ్..
అలా అని నేను వారిని ఏమి టార్చర్ చేయను. చిన్నప్పటి నుండి డిసిప్లేన్ గా ఉండడం నేర్పించాను. కానీ వాళ్లు మాత్రం చిన్నతనంలో నన్ను చూస్తే వణికిపోయే వాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం చాలా సరదాగా ఉంటాం. అందరం కలిసి ఒక దగ్గర కలిసి అప్పుడప్పుడు సరదాగా మాట్లాడుకుంటాం అంటూ రాకేష్ రోషన్ చెప్పుకొచ్చారు.ఇక హృతిక్ రోషన్ ఫ్యామిలీ పై ది రోషన్స్ అనే డాక్యుమెంటరీ కూడా వచ్చింది. ఇక హృతిక్ రోషన్ సుసానే ఖాన్ ల వైవాహిక బంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఇక విడాకుల తర్వాత హృతిక్ రోషన్(Hrithik Roshan) సబా ఆజాద్ అనే నటితో డేటింగ్ లో ఉన్నారు. అలాగే సుసానే ఖాన్ కూడా అర్స్ లన్ గోనీతో తరచూ డిన్నర్ డేట్, పబ్బులు అంటూ తిరుగుతుంది. అలా వీరిద్దరూ ప్రస్తుతం రిలేషన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే పెళ్లి మాత్రం చేసుకోలేదు.