PM Internship Scheme: దేశంలో యువతకు గుడ్ న్యూస్. ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ స్కీం ఇప్పటికే మొదలు కాగా, అప్లై చేసందుకు ఇంకా కొన్ని రోజులే అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకం కింద, యువతకు ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తారు. ఈ పథకాన్ని అమలు చేయడం ద్వారా యువతకు ప్రత్యక్ష లబ్ధి చేకూరనుంది.
ఆసక్తిగల అభ్యర్థులు
ఈ స్కీం అమలు ద్వారా యువత ఉద్యోగ నైపుణ్యాలను మెరుగుపరచుకునే అవకాశం ఉంది. అలాగే, వారికి నెలకు రూ.5,000 స్టైఫండ్, అదనంగా రూ.6,000 ప్రయాణ భత్యం అందిస్తారు. ఈ స్కీం కింద ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన యువతకు ప్రభుత్వ బీమా సదుపాయాలు కూడా లభిస్తాయి. మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవడం ద్వారా ఆసక్తిగల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ప్రధాని ఇంటర్న్‌షిప్ పథకాన్ని ఎందుకు ప్రారంభించారు?
భారతదేశ యువతకు నైపుణ్యాభివృద్ధిని పెంపొందించి, వారికి మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకం లక్ష్యం. కళాశాలలు పూర్తయిన తర్వాత యువత ఉద్యోగ అనుభవం లేకపోవడం వల్ల వారికి మంచి ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారుతోంది. అందుకే ఈ పథకాన్ని తీసుకువచ్చి, ప్రముఖ కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఇప్పటికే ప్రారంభించారు.
ఈ పథకంలో పాల్గొనే కంపెనీలు
ఈ పథకంలో అనేక ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయి. అర్హులైన యువతకు ఈ సంస్థలు ఇంటర్న్‌షిప్‌ను అందిస్తున్నాయి. భవిష్యత్తులో మరిన్ని కంపెనీలు ఈ ప్రోగ్రామ్‌లో చేర్చే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఈ సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసే విద్యార్థులకు వాస్తవిక పరిశ్రమ అనుభవం లభించడంతో పాటు, ఉద్యోగ అవకాశాలు పొందే అవకాశం కూడా ఉంటుంది.
Read Also: Merge PF Accounts: మీ ఎక్కువ పీఎఫ్ ఖతాలను ఇలా ఈజీగా
ఇంటర్న్‌షిప్ కోసం అర్హతలు
-ఈ పథకంలో చేరాలనుకునే అభ్యర్థులు మార్చి 31లోగా దరఖాస్తు చేసుకోవాలి.
-అభ్యర్థులు 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు అయి ఉండాలి.
-భారత పౌరసత్వం కలిగి ఉండాలి.
-ఏదైనా డిగ్రీ, డిప్లొమా, లేదా వృత్తి విద్యను పూర్తిచేసి ఉండాలి.
-సంబంధిత నైపుణ్యాల్లో ఆసక్తి ఉండాలి.
ఇంటర్న్‌షిప్ వివరాలు:
-మొత్తం వ్యవధి: 12 నెలలు
-ప్రతి నెలా స్టైఫండ్: రూ. 5,000
-ప్రయాణ ఖర్చుల కోసం: రూ.6,000 ఆకస్మిక భత్యం
-బీమా సదుపాయం: ప్రభుత్వం ప్రీమియం చెల్లించే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన
కోటి మంది యువతకు ఉపాధి లక్ష్యం
ఈ పథకం కింద రాబోయే 5 సంవత్సరాలలో 1 కోటి మంది యువతకు ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోంది.
ఈ పథకం ద్వారా యువతకు:
పరిశ్రమ, వ్యాపారం, సేవారంగాలలో వృత్తిపరమైన అనుభవం లభిస్తుంది.
ఉద్యోగ అవకాశాల పెరుగుదలతో వారికే కాదు, దేశ ఆర్థిక వ్యవస్థకూ మేలు జరుగుతుంది.
స్టైఫండ్, ప్రయాణ ఖర్చుల భత్యంతో ఆర్థిక సహాయం అందుతుంది.
ప్రభుత్వ బీమా రక్షణ పొందే అవకాశం ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి?
ఆధికారిక వెబ్‌సైట్ (https://pminternshipscheme.com/) లేదా జిల్లా ఉపాధి కార్యాలయ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు
ఇంటర్న్‌షిప్ అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకుని, పూర్తిగా వివరాలు నమోదు చేయాలి.
అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయాలి (ఆధార్ కార్డ్, విద్యార్హత ధృవపత్రాలు, పాస్‌పోర్ట్ సైజు ఫోటో, బ్యాంక్ ఖాతా వివరాలు మొదలైనవి).
దరఖాస్తును సమర్పించాలి.
ఎంపికైన అభ్యర్థులకు మెయిల్ లేదా SMS ద్వారా సమాచారం అందజేస్తారు.