BigTV English

OTT Movie: స్నేహానికి అద్దం పట్టే సినిమా… గుండెను పిండేసింది బాసూ

OTT Movie: స్నేహానికి అద్దం పట్టే సినిమా… గుండెను పిండేసింది బాసూ

OTT Movie : ఫ్రెండ్షిప్ ని అద్భుతంగా చూపించే సినిమాలు ఎన్నో వచ్చాయి. వీటిని ప్రేక్షకులు కూడా బాగా ఆదరించారు. తన కష్టాలను, సుఖాలను చెప్పుకునే ఏకైక వ్యక్తి ఫ్రెండ్ మాత్రమే. ఈ బంధాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. అటువంటి ఒక స్నేహ బంధంతో తమిళ ఇండస్ట్రీ నుంచి రీసెంట్ గా ఒక మూవీ వచ్చింది. ఈ మూవీ చూసినంత సేపు మిమ్మల్ని ఆలోచనలో పడేస్తుంది. మీ బెస్ట్ ఫ్రెండ్ ఖచ్చితంగా మీకు గుర్తుకు వస్తాడు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో వివరాల్లోకి వెళితే…


టెంట్కొట్టా (Tentkotta) లో

2024లో విడుదలైన ఈ తమిళ డ్రామా మూవీ మూవీ పేరు ‘మిన్మిని’ (Minmini). దీనికి హలిత షమీమ్ దర్శకత్వం వహించారు. ఇందులో ప్రధాన పాత్రల్లో ఎస్తర్ అనిల్, గౌరవ్ కాలై, ప్రవీణ్ కిషోర్ నటించారు. ముగ్గురు స్నేహితుల మధ్య ఈ స్టోరీ నడుస్తుంది. ఇది ఒక పాఠశాల నేపథ్యంలో ప్రారంభమై, తర్వాత హిమాలయాల్లో జరిగే ఒక సాహస యాత్రగా కొనసాగుతుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ టెంట్కొట్టా (Tentkotta) లో స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

2016 మధ్య కాలంలో ఊటీలోని స్ట్రీక్స్ మెట్రిక్యులేషన్ స్కూల్‌లో ఈ స్టోరీ మొదలవుతుంది. పరి ముకిలన్ ఒక అల్లరి విద్యార్థిగా పేరు తెచ్చుకుంటాడు. ఇతడు ఫుట్‌బాల్ కూడా బాగా ఆడుతాడు. తన క్లాస్‌మేట్ సబరి కార్తీకేయన్ తో ఇతడు కలిసి ఉంటాడు. సబరి ఒక ప్రతిభావంతుడైన చదరంగం ఆటగాడు. ఇతను శాంతమైన స్వభావం కలిగి ఉంటాడు. పరి హిమాలయాలను బైక్‌పై అన్వేషించాలని కలలు కంటూ ఉంటాడు. సబరి తన కళాకృతులను అక్రోపోలిస్ వంటి ప్రతిష్టాత్మక మ్యూజియంలలో ప్రదర్శించాలని ఆశిస్తాడు. ప్రారంభంలో వీరి మధ్య కొన్ని విభేదాలు వస్తాయి. పరి సబరిని బాగా ఎగతాళి చేసి చిరాకు పెట్టిస్తాడు. కానీ క్రమంగా వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడుతుంది. ఒక రోజు, స్కూల్ ట్రిప్ సమయంలో, సమీపంలోని ఒక గిరిజన గ్రామానికి వెళుతుండగా వారి బస్సు ప్రమాదానికి గురవుతుంది.

ఈ ప్రమాదంలో సబరి, ఆస్తమాతో బాధపడుతూ బస్సులో చిక్కుకుంటాడు. పరి తన ప్రాణాలను పణంగా పెట్టి సబరిని రక్షిస్తాడు. ఈ ఘటనలో పరి ప్రాణాలు కోల్పోతాడు. అ తరువాత అతని అవయవాలు ప్రవీణ అనే స్టూడెంట్ కు దానం చేయబడతాయి. ఈ సంఘటన తర్వాత, సబరి, ప్రవీణ ఇద్దరూ సర్వైవర్స్ గిల్ట్‌తో బాధపడతారు. కొన్ని సంవత్సరాల తర్వాత, వీళ్ళిద్దరూ హిమాలయాల్లో ఒక బైక్ యాత్రలో మళ్లీ కలుస్తారు. పరి కలను నెరవేర్చడానికి ఈ యాత్రలో, ప్రవీణ సబరికి సహాయం చేస్తుంది. చివరికి వీళ్ళు ఈ యాత్రను పూర్తిచేస్తారా ? అనే విషయం మీరు కూడా  తెలుసుకోవాలనుకుంటే, టెంట్కొట్టా (Tentkotta) ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘మిన్మిని’ (Minmini) అనే ఈ మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ మూవీలో అద్భుతమైన హిమాలయ దృశ్యాలు, సినిమాటోగ్రఫీ, ఖతీజా రెహమాన్ సంగీతానికి  ప్రశంసలు వచ్చాయి.

 

Related News

OTT Movie : ఇంటి ఓనర్లే ఈ కిల్లర్ టార్గెట్… వీడి చేతికి చిక్కారో నరకమే… క్రేజీ మలయాళ సైకో థ్రిల్లర్

OTT Movie : 8 ఏళ్ల పాపపై అఘాయిత్యం… బ్లడ్ బాయిలయ్యే మలయాళ క్రైమ్ డ్రామా

OTT Movie : కన్న కూతురిని జూదానికి బలిచ్చే తండ్రి… మొత్తం అవే సీన్లు… సింగిల్ గా చూడాల్సిన మూవీ మావా

OTT Movie : పాక్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన భారత్… హిస్టరీలో మిస్టరీగా మిగిలిన రా ఆపరేషన్… స్పై థ్రిల్లర్ ప్రియులకు పండగే

OTT Movie : చావుకు దగ్గరైన వాళ్ళను సింథటిక్ బొమ్మలుగా… ఏలియన్ ఎంట్రీతో దిమ్మతిరిగే ట్విస్ట్… భవిష్యత్తు అంటేనే భయపెట్టే సై-ఫై సిరీస్

OTT Movie : ప్రియురాలిని పరాయి మగాళ్లకు పణంగా… 16 ఏళ్ల వయసులో రాకూడని కష్టం… కిరాక్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×