Prasar Bharati recruitment: డిగ్రీ, ఎంసీజేలో పీజీ పూర్తి అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ప్రసార భారతి, హైదరాబాద్‌లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. కాంట్రాక్ట్ విధానంలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు జనవరి 31లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
హైదరాబాద్, ప్రసారభారతిలో సీనియర్ కరస్పాండెంట్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులందరూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ఖాళీగా ఉన్న పోస్టు: సీనియర్ కరస్పాండెంట్
విద్యార్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ(ఎంసీజే) పాస్‌తో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా కలిగి ఉండాలి.
వయస్సు: 2025 జనవరి 16 నాటికి 45 ఏళ్ల వయస్సు మించి ఉండదారు.
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.80,000 నుంచి రూ.1,25,000 ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
ఐదేళ్ల వర్క్ ఎక్స్ పీరియన్స్ కలిగి ఉండాలి.
హైదరాబాద్ లో ఉద్యోగం చేయాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 31
అఫీషియల్ వెబ్ సైట్: https://prasarbharati.gov.in/
Also Read: Jobs in NTPC: బీటెక్ అర్హతతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు.. ఈ ఉద్యోగం వస్తే నెలకు రూ.1,00,000
అర్హత ఉన్న అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.