Jobs in NTPC: బీఈ, బీటెక్, పీజీడీఎం, ఎంబీఏ పాసైన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఎన్టీపీసీ లిమిటెడ్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
నిరుద్యోగులకు ఇది మంచి అవకాశం. ఎన్టీపీసీ లిమిటెడ్(NTPC)లో సీనియర్ ఎగ్జిక్యూటివ్(కమర్షియల్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 8
ఇందులో యూఆర్-5, ఓబీసీ-2, ఎస్సీ-1 ఉద్యోగాలు ఖాళీగాలు ఖాళీగా ఉన్నాయి.
ఇందులో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, పీజీడీఎం, ఎంబీఏ పాస్‌తో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా ఉండాలి.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థి వయస్సు 38 ఏళ్లు మించరాదు. (ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంది)
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.300 ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు)
ఆన్ లైన్ విధానంలోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.లక్ష జీతం ఉంటుంది.
దరఖాస్తు ప్రారంభ తేది: 2025 జనవరి 21
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 04
అఫీషియల్ వెబ్ సైట్: https://www.nspcl.co.in/
Also Read: UPSC Civil Services Exam 2025: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2025 నోటిఫికేషన్ విడుదల..
అర్హత ఉన్న అభ్యర్థులందూ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగాన్ని సాధించండి. ఆల్ ది బెస్ట్.