Amrita Fadnavis New Look: మహారాష్ట్ర సీఎం సతీమణి దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. మోడల్ గా, యాక్టర్ గా, సింగర్ గా రాణించిన ఆమె, సీఎం సతీమణిగా పలు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. చక్కటి డ్రెస్సింగ్ సెన్స్ ను కలిగి ఉంటారు. ఓవైపు ట్రెడిషనల్ వేర్ లో ఆకట్టుకుంటూనే.. మరోవైను మోడ్రన్ లుక్ లోనూ ఆహా అనిపిస్తుంటారు. సందర్భానికి తగినట్లుగా డ్రెసింగ్ స్టైల్ ను ఫాలో అవుతారు.
స్పోర్ట్స్ డ్రెస్ లో మారథాన్ వేడుకలో పాల్గొన్న అమృత
ఇక తాజాగా ముంబైలో జరిగిన ఓ మారథాన్ కార్యక్రమానికి అమృతా ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలలో తెగ వైరల్ అయ్యింది. ఆ వీడియోలో శరీరానికి అతుక్కుపోయినట్లుగా ఉన్న స్పోర్ట్స్ డ్రెస్ లో కనిపించారు అమృత. నిర్వాహకులు, మారథాన్ లో పాల్గొనే ఔత్సాహికులతో కలిసి ఆమె సందడి చేశారు. కాసేపు రన్ లోనూ పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.
అమృత డ్రెస్ పై నెటిజన్ల విమర్శలు
అటు అమృతా ఫడ్నవీస్ వేసుకున్న డ్రెస్ మీద సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం భార్య అయి ఉండి అలాంటి డ్రెస్సులు వేసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మారథాన్ లో పాల్గొంటే అలాంటి డ్రెస్ వేసుకోవాలి గానీ, ప్రారంభించేందుకు ఎందుకు అలా రావాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. పబ్లిక్ లోకి వచ్చే సమయంలో కాస్త ట్రెడిషనల్ డ్రెస్ వేసుకుంటే బాగుంటుందని సలహాలు ఇస్తున్నారు. అయితే, సందర్భానికి తగినట్లుగా ఆమె డ్రెస్ వేసుకుందని, అందులో తప్పేం లేదని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. ఆ కార్యక్రమానికి సరిపోయేలా డ్రెస్ వేసుకోవడాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదంటున్నారు.
Read Also: రాహుల్ వల్లే నా పాల క్యాన్ పడిపోయింది, కోర్టుకెక్కిన బీహార్ వ్యక్తి!
స్పోర్ట్స్ డ్రెస్‌లో సందడి చేసిన సీఎం సతీమణి.. వైరల్..!
ముంబైలో జరిగిన ఓ కార్యక్రమానికి స్పోర్ట్స్ డ్రెస్‌లో హాజరైన మహారాష్ట్ర సీఎం సతీమణి అమృత ఫడ్నవీస్
ఔత్సాహికులతో కలిసి రన్లో పాల్గొని సందడి చేసిన అమృత
వృత్తిపరంగా నటి, గాయకురాలిగా రాణించిన అమృత pic.twitter.com/50N1VFOYD7
— BIG TV Breaking News (@bigtvtelugu) January 22, 2025
Read Also: తాను సాధ్వీ అని చెప్పుకుంటోంది గానీ.. అసలు సంగతి తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఫ్యాషన్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన అమృతా ఫడ్నవీస్
అమృత ఫడ్నవీస్ ప్యాషన్ బ్యాగ్రౌండ్ నుంచి రావడంతో.. సీఎం భార్య అయినప్పటికీ పలు ప్యాషన్ షోలలో పాల్గొంటారు. వుమెన్ ఎంపర్ మెంట్ కోసం పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమె నటి, సింగర్ కూడా. ఈ నేపథ్యంలోనే అమృతా ఫడ్నవీస్, ఓ వైపు మోడ్రన్ గా కనిపిస్తూనే, ట్రెడిషనల్ గానూ ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియా నుంచి వచ్చే విమర్శలను సైతం ఆమె పెద్దగా పట్టించుకోదు. తనకు నచ్చేలా ఉంటాననేది తన ఫిలాసఫీ.
Chief guest @ficci_india @FICCIFLO half marathon,Pune-towards cause of women empowerment by training them in unconventional professions 💪👍 pic.twitter.com/NjTpB5qtYs
— AMRUTA FADNAVIS (@fadnavis_amruta) October 9, 2017
Read Also: పుణ్య స్నానాలకు వచ్చి.. బ్యూటీల వెంట పడతారేంట్రా బాబు, చివరికి ఆమె…