Curry Leaves: ప్రతి ఒక్కరి వంటగదిలో కరివేపాకు తప్పకుండా ఉంటుంది. కరివేపాకు ఆహారంలో రుచిని పెంచడానికే కాకుండా ఆరోగ్యం, అందాన్ని మెరుగుపరచడంలో ప్రభావ వంతంగా పనిచేస్తుంది. తరుచుగా కరివేపాకు తినడం వల్ల కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇదిలా ఉంటే ప్రతి రోజు ఉదయం 5 కరివేపాకులను తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
కరివేపాకుతో కలిగే ప్రయోజనాలు:
కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో యాసిడ్స్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. అంతే కాకుండా జుట్టు మూలాలను కూడా బలపరుస్తాయి. జుట్టు మందంగా మార్చడంతో పాటు రాలకుండా చేస్తాయి. ప్రతి రోజు 5 కరివేపాకులను తినడం వల్ల కొన్ని రోజుల్లోనే మీ జుట్టుకు కొత్త జీవం వస్తుంది. ఒత్తైన జుట్టు కోసం కనివేపాకును రోజు ఉదయం ఖాళీ కడుపుతో తినవచ్చు. కరివేపాకులు వేసి తయారు చేసిన నూనెతో జుట్టు మసాజ్ చేసినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఈ ఆయిల్ జుట్టు రాలకుండా కూడా చేస్తుంది.
జీర్ణ వ్యవస్థ:
మారుతున్న ఆహారపు అలవాట్లతో పాటు ఒత్తిడి కారణంగా జీర్ణ సమస్యలు పెరుగుతున్నాయి. అయితే జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో కరివేపాకు చాలా బాగా పనిచేస్తుంది. అంతే కాకుండా ఇది గ్యాస్, మలబద్దకం వంటి సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది.
కరివేపాకులో సహజ ఫైబర్‌తో పాటు ఎంజైములు కూడా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను సులభం చేస్తాయి. కరివేపాకులను ఆహారంలో భాగంగా చేసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. కరివేపాకులో హైపోగ్లైసీమిక్ లక్షణాలు కూడా ఉన్నాయి . ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి, మధుమేహ వ్యాధి గ్రస్తులు దీనిని తప్పకుండా తీసుకోవాలి. జీర్ణ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడే వారు కరివేపాకులను తినడం వల్ల సమస్య నుండి ఈజీగా బయటపడతారు.
చర్మానికి మేలు:
కరివేపాకు చర్మానికి కూడా చాలా మేలు చేస్తుంది.ఇందులో విటమిన్ ఎ. సి పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని యవ్వనంగా చేస్తుంది. అంతే కాకుండా శరీరంలోని టాక్సిక్ ఎలిమెంట్లను కూడా తొలగిస్తుంది. చర్మానికి సహజమైన మెరుపును అందించడంలో చాలా బాగా పనిచేస్తుంది. కరివేపాకులను పేస్ట్ లాగా చేసి కూడా జుట్టుకు అప్లై చేయవచ్చు.
Also Read: అసిడిటీతో ఇబ్బంది పడుతున్నారా ? వీటితో క్షణాల్లోనే రిలీఫ్
బరవు తగ్గడానికి:
బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే గనక మీరు కరివేపాకులను ఎక్కువగా తినాలి. ఇది మీ జీవక్రియను మెరుగుపరుస్తుంది. కరివేపాకులో శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించే గుణాలు ఉంటాయి. కరివేపాకులను నీటిలో వేసి మరిగించి త్రాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది కొవ్వును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అధఇక బరువు సమస్యతో ఇబ్బంది పడే వారు కరివేపాకును తరుచుగా తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
కరివేపాకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతే కాకుండా వీటిని తినడం వల్ల జుట్టు పెరుగుతుంది. ఇందులో ఉండే పోషకాలు జుట్టును దృఢంగా చేస్తాయి. కాబట్టి మీరు ప్రతి రోజు ఉదయం 5 కరివేపాకులను తినడం అలవాటు చేసుకోండి.