E-Paper
Advertisement

BEL Recruitment: బీటెక్ అర్హతతో ఇంజినీర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా 4 రోజులే ఛాన్స్..

BEL Recruitment: బీటెక్ అర్హతతో ఇంజినీర్ ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇంకా 4 రోజులే ఛాన్స్..
Advertisement

BEL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బీఈ, బీటెక్, బీఎస్సీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో తాత్కాలిక ప్రతిపాదికన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కూడా ఉంటుంది. ఈ నెల 20న దరఖాస్తు గడువు ముగియనుంది. అంటే దరఖాస్తుకు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది.

నిరుద్యోగులకు ఇది సువర్ణవకాశం. భారత ప్రభుత్వ రంగ సంస్థ నవరత్న కంపెనీ అయిన బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL).. తాత్కాలిక విధానంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 137

ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ట్రైనీ ఇంజినీర్-1, ప్రాజెక్ట్ ఇంజినీర్-1 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

పోస్టుల వారీగా..

ట్రైనీ ఇంజినీర్-1 ఉద్యోగాలు: 67

ప్రాజెక్ట్ ఇంజినీర్-1 ఉద్యోగాలు: 70

విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజినీరింగ్ డిగ్రీ పాస్ తో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సు ఉంటుంది. ట్రైనీ ఇంజినీర్ ఉద్యోగానికి 28 ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ ఉద్యోగానికి 32 ఏళ్లు మించరాదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. ట్రైనీ ఇంజినీర్ ఉద్యోగానికి మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.35,000 ఉంటుంది. మూడో ఏడాదికి రూ.40,000 ఉంటుంది. ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగానికి మొదటి ఏడాది రూ.40,000 ఉంటుంది. రెండో ఏడాది రూ.45,000 ఉంటుంది. మూడో ఏడాది రూ.50,000 ఉంటుంది. నాలుగో ఏడాది రూ.55,000  జీతం కల్పిస్తారు.

ఉద్యోగ ఎంపిక విధానం: ట్రైనీ ఇంజినీర్ పోస్టుకు రాత పరీక్ష, షార్ట్ లిస్టింగ్ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. ప్రాజెక్ట్ ఇంజినీర్ ఉద్యోగానికి రాతపరీక్ష, ఇంటర్వ్యూ, తదితర ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

అప్లికేషన్ ఫీజు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ట్రైనీ ఇంజినీర్‌ పోస్టులకు రూ.150+జీఎస్‌టీ ఉంటుంది. ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌ పోస్టులకు రూ.400+జీఎస్‌టీ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు పంపాల్సిన చిరునామా:  డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌, ప్రొడక్ట్‌ డెవెలప్‌మెంట్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌, భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌, ప్రొఫెసర్‌ యూఆర్‌ రావు రోడ్‌, నాగాలాండ్‌ సర్కిల్‌, జళహల్లి పోస్టు, బెంగళూరు చిరునామాకు పంపించాలి.

దరఖాస్తుకు చివరి తేది: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సిన అభ్యర్థులు 2025 ఫిబ్రవరి 20వ తేదీ లోపు అప్లికేషన్ పెట్టుకోవాలి.

Also Read: Hyderabad traffic: హైదరాబాద్‌లో ట్రాఫిక్ యమ టఫ్.. కానీ ఇవ్వి అమలైతే దూసుకెళ్లొచ్చు

పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://bel-india.in/

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×