IPL 2025 Schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) కోసం ఎదురుచూస్తున్న వారికి బిగ్ అలర్ట్. కాసేపటికి క్రితమే ఐపిఎల్ 2025 టోర్నమెంటుకు సంబంధించిన… షెడ్యూల్ వచ్చేసింది. ఈ మేరకు ఐపీఎల్ యాజమాన్యం అధికారిక ప్రకటన చేసింది. మార్చి 22వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ జరగనుంది. అంటే ఐపీఎల్ 2025… మార్చి 22వ తేదీ నుంచి 65 రోజులపాటు జరగనుంది. 13 వేదికలలో 74 మ్యాచులు నిర్వహించనున్నారు. ఈ టోర్నమెంట్లో తొలి మ్యాచ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( RCB ) వర్సెస్… కేకేఆర్ ( KKR ) జట్ల మధ్య జరగనుంది. అందరూ ఊహించినట్లుగానే తొలి మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI ). తొలి మ్యాచ్… కోల్కత్తాలోని ఈడెన్ గార్డెన్స్ లో నిర్వహించనున్నారు.
Also Read: ICC Champions Trophy: 8 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ..ఇంత గ్యాప్ రావాడానికి కారణాలు ఇవే ?
ఇక రెండవ మ్యాచ్ హైదరాబాద్ ( SRH ) వర్సెస్… రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals ) మధ్య… మార్చి 23వ తేదీన అంటే ఆదివారం రోజున జరగనుంది. ఈ రెండవ మ్యాచ్ హైదరాబాదులోని ( Hyderabad Uppal )ఉప్పల్ వేదికగా జరగనుంది. ఇక మూడవ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ ( CSK ) వర్సెస్… ముంబై ఇండియన్స్ ( Mumbai indians ) మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ మార్చి 23వ తేదీ ఆదివారం రాత్రి చెన్నై వేదికగా నిర్వహించనున్నారు. అంటే మార్చి 23వ తేదీన రెండు మ్యాచులు జరగబోతున్నాయి.
IPL 2025 KNOCKOUTS SCHEDULE:
ఇండియన్ ప్రీమియర్ లీగ్ నాకౌట్ మ్యాచ్ల షెడ్యూల్ ఒకసారి పరిశీలిస్తే… క్వాలిఫైయర్ మొదటి మ్యాచ్ హైదరాబాదులో మే 20వ తేదీన జరగనుంది. మే 21వ తేదీన.. హైదరాబాదులోనే ఎలిమినేటర్ మ్యాచ్ కూడా జరుగుతుంది. క్వాలిఫైయర్ 2 ఈడెన్ గార్డెన్స్ లో.. మే 23వ తేదీన జరగనుంది. ఐపీఎల్ 2025 ఫైనల్ మే 25వ తేదీన ఈడెన్ గార్డెన్స్ లో జరగనుంది. ఐపీఎల్ 2025 షెడ్యూల్ ప్రకారం ఒక్కో జట్టు ఏకంగా 14 మ్యాచ్లు ఆడనుంది. మొదటి రౌండులో ఏడు మ్యాచ్లు ఆడిన తర్వాత… రెండవ రౌండ్లో మరో ఏడు మ్యాచ్లు ఉంటాయి. ఉదాహరణకు హైదరాబాద్ జట్టు చెన్నైతో కచ్చితంగా గ్రూప్ స్టేజిలో రెండుసార్లు తలపడాల్సి ఉంటుంది.
ఆ తర్వాత క్వాలిఫైయర్ , ఫైనల్ కు ఈ రెండు జట్లే వెళితే… మళ్లీ ఆడాల్సి వస్తుంది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటుకు సంబంధించిన… మ్యాచ్ లను జియో హాట్ స్టార్ లో చూడవచ్చు. అయితే ఈసారి ఉచితంగా ఐపీఎల్ చూడలేమని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మరికొంతమంది జియో సిమ్ ఉన్నవారు.. జియో హాట్ స్టార్ లో మ్యాచులు చూడవచ్చని చెబుతున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు జియో హాట్ స్టార్ ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనిపై త్వరలో క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఫ్రీగా ఇస్తే జియో సిమ్ వాడేవారికి.. ఐపీఎల్ ఉచితంగా చూడే అవకాశం ఉండే ఛాన్స్ ఉంది.
Also Read: Roshan – CCL: తెలుగు వారియర్స్ లో మరో అభిషేక్ శర్మ..సిక్సులే సిక్సులు !
Mark your calendars, folks! 🥳🗓#TATAIPL 2025 kicks off on March 2️⃣2️⃣ with a clash between @KKRiders and @RCBTweets 🤜🤛
When is your favourite team's first match? 🤔 pic.twitter.com/f2tf3YcSyY
— IndianPremierLeague (@IPL) February 16, 2025
FIRST 3 MATCHES IN IPL 2025:
– The Blockbuster Opening..!!!! 🏆 pic.twitter.com/EKIu7ULFM2
— Tanuj Singh (@ImTanujSingh) February 16, 2025
Mumbai Indians matches in 2025 IPL SEASON 💥💙#IPL2025 pic.twitter.com/hBtP5ODGQP
— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) February 16, 2025
The moment you've all been waiting for 🧡
Mark your calendars, #OrangeArmy! It's time to #PlayWithFire 🔥#TATAIPL2025 pic.twitter.com/FTXpFMqFCg
— SunRisers Hyderabad (@SunRisers) February 16, 2025