BigTV English

Wipro Recruitment: గోల్డెన్ ఛాన్స్.. విప్రోలో ఉద్యోగాలు.. లక్షల జీతం

Wipro Recruitment: గోల్డెన్ ఛాన్స్.. విప్రోలో ఉద్యోగాలు.. లక్షల జీతం

Wipro Recruitment: ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ విప్రో గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు సూపర్ న్యూస్ చెప్పింది. ఇంజినీరింగ్ గ్రాడ్యేయేట్ల కోసం టర్బో హైరింగ్ ప్రోగ్రామ్ 2025 ను లాంచ్ చేసింది. అర్హత ఉన్న గ్రాడ్యుయేట్స్ అందిరికీ ఇది అద్భుత అవకాశం అని చెప్పవచ్చు. ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ చదివిన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం. విప్రో టర్బో హైరింగ్ ప్రోగ్రామ్ ను టాప్ కాలేజీల్లో చదివిన విద్యార్థుల కోసం తీసుకొచ్చారు. ఈ ప్రోగ్రామ్ లో కనుక సెలెక్ట్ అయితే వరల్డ్ క్లాస్ ప్రాజెక్టుల్లో పని చేసే ఛాన్స్ దొరుకుతుంది. అంతే కాకుండా టెక్నాలజీస్ పై  పని చేస్తూ సర్టిఫికెట్లు కూడా సంపాదించుకోవచ్చు.


ఇందులో కనుక సెలెక్ట్ అయితే పై చదువుల కోసం ఫుల్ స్కాలర్ షిప్ కూడా పొందే అవకాశం ఉంటుంది.

విద్యార్హత: బీఈ లేదా బీటెక్ చదివి ఉండాలి. కంప్యూటర్ సైన్స్, ఐటీ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ లాంటి బ్రాంచీల్లో పూర్తి చేసి ఉండాలి. 2025లోనే బీటెక్ పూర్తి చేసి ఉండాలి. టెన్త్ , ఇంటర్ లో కనీసం 60 శాతం మార్కులతో పాస్ అవ్వాలి. డిగ్రీలో కూడా 60 శాతం మార్కులతో పాసై ఉండాలి. లేదా 6.0 సీజీపీఏ ఉండాలి. రెగ్యులర్ కాలేజీలోనే డిగ్రీ చదివి ఉండాలి. ఒక బ్యాక్‌లాగ్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. కానీ 8వ సెమిస్టర్ లోపు క్లియర్ చేసుకోవాలి. టెన్త్ క్లాస్ కు, డిగ్రీకి మధ్యలో మూడేళ్ల గ్యాప్ మాత్రమే ఉండాలి. బీటెక్ నాలుగు సంవత్సరాల్లోనే పూర్తి చేసి ఉండాలి. టెన్త్, ఇంటర్ ఓపెన్ లో చదివినే అర్హులుగానే భావిస్తారు.


ఉద్యోగం: సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ విప్రోలో ప్రాజక్ట్ ఇంజినీర్ గా చేరుతారు. ఈ ఉద్యోగం వస్తే మెడికల్ అసిస్టెన్స్ స్కీమ్, మెడికల్ ఇన్సూరెన్స్, గ్రూప్ యాక్సిడెంట్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, పేరెంట్స్ కు కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది.

జీతం: రూ.6,50,000 ఉంటుంది.

ఇతర బెనిఫిట్స్: పీఎఫ్, గ్యాట్యుయిటీ, ఆప్షనల్ పెన్షన్ ప్లాన్, సర్వైవర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి.

అగ్రిమెంట్: సెలెక్ట్ అయిన అభ్యర్థులు 12 నెలల లోపు సర్వీస్ అగ్రిమెంట్ పై సంతకం చేయాలి. ఒకవేళ మధ్యలో మానేస్తే రూ.75,000 చెల్లించాల్సి ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: కొన్ని స్టేజీల్లో సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఆన్ లైన్ అసెస్ మెంట్: ఆప్టిట్యూట్ టెస్ట్ ఉంటుంది. ఆ తర్వాత కోడింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది పాసైతే రాత పరీక్ష ఉంటుంది.

వాయిస్ అసెస్ మెంట్ రౌండ్: పై మూడు టెస్టుల్లో షార్ట్ లిస్ట్ అయిన వారికి వాయిస్ బేస్డ్ అసెస్ మెంట్ నిర్వహిస్తారు. బిజినెస్ డిస్కెషన్ ఉంటుంది. ఇందులో జాబ్ రోల్ గురించి వివరిస్తారు.

బిజినెస్ డిస్కెషన్ క్లియర్ చేస్తే.. లెటర్ ఆఫ్ ఇంటెంట్ వస్తుంది.

ప్రీ-స్కిల్లింగ్ ట్రైనింగ్: ట్రైనింగ్ ఇస్తారు.

ప్రీ-స్కిల్లింగ్ ట్రైనింగ్: విప్రోలో జాబ్ చేయడానికి మిమ్మల్ని రెడీ చేయడానికి ట్రైనింగ్ ఇస్తారు.

అన్నీ రౌండ్స్ సునాయసంగా ఫినిష్ చేస్తే ఫైనల్ గా ఆఫర్ లెటర్ ప్రకటిస్తారు.

చివరి తేది: 2025 ఫిబ్రవరి 28.

రిజిస్ట్రేషన్ లింక్: https://app.joinsuperset.com/

అప్లికేషన్ లింక్: https://app.joinsuperset.com/company/wipro/turbo.html

అర్హత ఉన్న స్టూడెంట్స్ అందరూ ఈ అద్భుత అవకాశాన్ని మిస్ చేసుకోకండి. అప్లై చేసుకోండి. జాబ్ సాధించండి. ఆల్ ది బెస్ట్.

Related News

Indian Army Jobs: రూ. 18 లక్షల జీతంతో.. ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు

Telangana Govt Jobs: ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు.. మెరిట్ లిస్ట్ రిలీజ్, ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్

DSSSB Jobs: సబార్డినేట్ సర్వీసెస్‌లో 615 ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు

CCRAS: పది, ఇంటర్ పాసైన వారికి సువర్ణవకాశం.. మంచి వేతనం, ఇలా దరఖాస్తు చేసుకోండి..

Union Bank of India: యూనియన్ బ్యాంక్‌‌లో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే..

DSSSB Jobs: ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్‌లో 2119 ఉద్యోగాలు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు.. ఇంకా 3 రోజులే..?

Big Stories

×