Brahmanandam: వయస్సు పెరిగేకొద్దీ ప్రతి మనిషిలో పెద్దరికం పెరుగుతూ ఉంటుంది. ఒక ఆలోచన వస్తుంది. అన్నింటిని నెమ్మదిగా ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలు అయితే మరింత ఆచితూచి మాట్లాడాలి. వయస్సు పెరిగితే సీనియారిటీ వస్తుంది కానీ.. ఎక్కడ ఎలా మాట్లాడాలి అన్నది వారికున్న పెద్దరికం బట్టే వస్తుంది. ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో చాలామంది సీనియర్ హీరోలు.. వయస్సు పెరిగినవారు.. స్టేజిల మీద ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. వారందరూ కూడా హాస్య బ్రహ్మ బ్రహ్మానందంను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు.
ఈ మధ్యకాలంలో స్టేజిలపై సీనియర్, జూనియర్ అని లేదు.. మైక్ దొరికింది కదా అని ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తున్నారు. కొందరు రాజకీయాలు మాట్లాడుతున్నారు.. ఇంకొందరు ఆడవాళ్ళ గురించి అసభ్యంగా మాట్లాడుతున్నారు.. మరికొందరు మా వంశం అంటూ.. ఇంకొందరూ రాజకీయ నాయకుల మీద సెటైర్లు.. ఇలా ఒకరు అని లేదు. చాలామంది స్టార్స్ ఇదే ధోరణిని అవలంబిస్తున్నారు. దీనివలన ప్రేక్షకులు, అభిమానులు వారిపై పెట్టుకున్న గౌరవాన్ని వారికి వారే తగ్గించేసుకుంటున్నారు.
బ్రహ్మీ వయస్సు 69 ఏళ్లు. ఏరోజు స్టేజిపై ఎక్కువ తక్కువ మాట్లాడింది లేదు. కామెడీగా ఆయన సినిమాల్లో చేసిన హావభావాలను చూపించడం, నవ్వించడం తప్ప.. అసభ్యంగా కానీ, అనవసరమైన విషయాలు కానీ, మాట్లాడింది లేదు. ఇక చాలా గ్యాప్ తరువాత బ్రహ్మ ఆనందం సినిమా కోసం ఆయన ఈవెంట్స్ లో, ఇంటర్వ్యూ లలో మాట్లాడాడు. అక్కడ కూడా ఎక్కడా నోరు అదుపు తప్పి మాట్లాడలేదు.
ఒకరిని కించపర్చలేదు. ఒకరి గురించి చెడుగా చెప్పలేదు. అసలు ఎవరి గురించి పేరు ఎత్తింది కూడా లేదు. ఆయనకంటూ ఉండే ఒక యూనిక్ స్టైల్. ఎంతో పద్దతిగా .. ఎంతో పెద్దరికంగా మాట్లాడిన విధానం ఫ్యాన్స్ ను మంత్రముగ్దులను చేస్తుంది. కొడుకులను ఎందుకు మంచి హీరోలుగా చేయలేకపోయారు అన్న ప్రశ్నకు కూడా.. ఎవరిని నొప్పించకుండా.. అది తన తప్పే అని ఒప్పుకొని మాట్లాడిన తీరు ఆకట్టుకుంటుంది.
Actress Ramya Sri: 13 ఏళ్లకే పెళ్లి.. ఇంట్లో నుంచి పారిపోయి వచ్చా.. అతని ఇంట్లో మూడు రోజులు..
సినిమా చూడడానికి స్టార్ డమ్ ఉండాలి. బ్రహ్మానందం సినిమా అని చూడాలి.. ఇలాంటివేమీ కాకుండా కథ నచ్చితేనే సినిమా చూస్తారు. ప్రేక్షకులు మాములువాళ్లు కాదు. ఇక్కడ అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. మనం ఇంత గొప్పవాళ్ళం అన్న విషయం తలకెక్కకుండా చూసుకోవాలి. నేనెంత గొప్పవాడినో అని భుజకీర్తనలు పాడితే భుజాలకు పుండ్లు పడతాయి. ఒక సగటు మనిషిలా ఉండాలి అని బ్రహ్మీ ఒక ఈవెంట్ లో చెప్పుకొచ్చాడు.
నిజంగా హాస్యబ్రహ్మ చెప్పింది అక్షర సత్యం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమే గొప్పవారి లక్షణం అన్నప్పుడు.. చాలామంది స్టార్స్ నేను ఇది చేశాను.. నేను అది చేశాను అని చెప్పుకోవడంలో అర్ధం లేదు. ఇంకొందరు.. ఇంకా పేర్లు చెప్పుకొని సినిమాలకు రావాలని కోరుతున్నారు అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక బ్రహ్మీ కొన్ని కొన్ని ఇంటర్వ్యూలలో ఎన్నో మంచి విషయాలను చెప్పుకొచ్చాడు. అవన్నీ విన్న అభిమానులు ఇది పెద్దరికం అంటే.. ఇది సంస్కారం అంటే అంటూ చెప్పుకొస్తున్నారు.