Project Manager Jobs: సిివిల్ విభాగంలో బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థుందరూ ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిబ్రవరి 11తో దరఖాస్తు గడువు ముగియనుంది.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI)లో కాంట్రాక్ట్ విధానంలో ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూసేద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 4
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాలో ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీటెక్(సివిల్ విభాగంలో) పాసై ఉండాలి.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 40 ఏళ్లు మించరాదు.
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు ఏడాదికి రూ.17,00,000 జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు ప్రక్రియ: ఈ-మెయిల్ hr.nhipmpl@nhai.org ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 11
నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి సమాచారం కావాలనుకునే అభ్యర్థులు అఫీషియల్ వెబ్ సైట్‌ను సంప్రదించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://nhai.gov.in
అర్హత ఉణ్న అభ్యర్థులందరూ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సిివిల్ విభాగంలో బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి భారీ వేతనం లభిస్తుంది. ఏడాదికి రూ.17,00,000 జీతం ఇవ్వనున్నారు. ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
…………………………………………………………….
సికింద్రాబాద్ ఆర్ఆర్‌సీలో ఉద్యోగాలు..
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. సికింద్రాబాద్‌లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ)- దక్షిణ మధ్య రైల్వే ఎస్‌సీఆర్- స్పోర్ట్స్ కోటాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్ధులు ఫిబ్రవరి 3వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 61
ఎస్‌సీఆర్ యూనిట్ ప్రదేశాలు: సికింద్రాబాద్, హైదరాబాద్, గుంటూరు, గుంతకల్, నాందెడ్.
లెవెల్-1, లెవల్-3/2 రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి టెన్త్, ఐటీఐ, ఇంటర్మీడియట్ పాస్ తో పాటు నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికేట్ కల్గి ఉంటే సరిపోతుంది. క్రీడాంశాల్లో వివిధ స్థాయుల్లో విజయాలు సాధించిన వారు అర్హులవుతారు.
క్రీడాంశాలు: అథ్లెటిక్స్, బాస్కెట్‌బాల్, క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్, హాకీ, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, గోల్ఫ్, చెస్, జిమ్నాస్టిక్, బాక్సింగ్, ఆర్చరీ, వెయిట్‌లిఫ్టింగ్, ఖోఖో ఆట్లలో రాణించి ఉండాలి.
వయస్సు: 2025 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
ఉద్యోగ ఎంపిక విధానం: విద్యార్హత, క్రీడా విజయాలు, గేమ్ స్కిల్, ఫిజికల్ ఫిట్‌నెస్, ట్రయల్స్ సమయంలో కోచ్ పరిశీలించే అంశాలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.500 ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ ఈఎస్‌ఎం/ దివ్యాంగులు/ మహిళలు/ మైనారిటీలు/ ఈబీసీ అభ్యర్థులకు రూ.250 ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 3
అఫీషియల్ వెబ్ సైట్: https://scr.indianrailways.gov.in/