Zepto Vivo : ప్రముఖ డెలివరీ సంస్థ Zeptoతో వివో పార్ట్నర్ షిప్ ను ప్రారంభించింది. దీంతో నచ్చిన మొబైల్ ను ఆర్డర్ పెట్టిన పది నిమిషాల్లోనే యూజర్ అందుకునే ఛాన్స్ కల్పించింది.
టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతున్న ఈ కాలంలో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలు తమ యూజర్స్ కోసం కొత్త కొత్త దారులను అన్వేషిస్తున్నాయి. టాప్ సంస్థలన్నీ తీసుకువస్తున్న మొబైల్స్ లో కొత్త ఫీచర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. వీటితో పాటు సరికొత్త అప్డేట్స్ ను అందిస్తున్నాయి. ఇలా ఎప్పటికప్పుడు తమ యూజర్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఇక ఆన్లైన్ డెలివరీ విషయానికి వస్తే.. ఆన్లైన్ లో మొబైల్ కొనుగోలు చేసినప్పుడు వీలైనంత తొందరగా యూజర్ ను చేరుకోవడం మరింత ఆకట్టుకునే అంశం. దీన్ని ఆధారంగా చేసుకుని ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో ఆన్లైన్ డెలివరీ ప్లాట్ఫామ్ Zeptoతో పార్టనర్ షిప్ కుదుర్చుకుంది.
Vivo స్మార్ట్‌ఫోన్ డోర్‌స్టెప్ డెలివరీను అందించడానికి క్విక్ కామర్స్ సర్వీస్ Zepto తో చేతులు కలిపింది. స్పీడ్ డెలివరీని అందుకోవడానికి కస్టమర్‌లు ఎంచుకున్న Vivo స్మార్ట్‌ఫోన్‌లను తక్షణమే డెలివరీ చేస్తుంది. కస్టమర్ ఆర్డర్ చేసిన మెుబైల్ 10 నిమిషాల కంటే తక్కువ సమయంలోనే గమ్య స్థానాన్ని చేరుకుంటుంది. Zepto యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా Vivo స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేసే కస్టమర్‌లకు స్టార్టింగ్ ఆఫ్షన్ గా ఆఫర్ లో రూ. 5,000 వరకు తగ్గింపు కూడా అందిస్తుంది.
Zeptoలో ఏ ఏ మెుబైల్ కొనుగోలు చేసే ఛాన్స్ ఉందంటే – ప్రస్తుతం ఆన్‌లైన్ డెలివరీ కోసం Zeptoలో రెండు స్మార్ట్‌ఫోన్‌లు లిస్ట్ అయ్యాయి. వీటిలో Vivo Y29 5G, Vivo Y81i ఉన్నాయి.
Vivo Y29 5G –
Zeptoలో Vivo Y29 5Gను 4GB RAM + 128GB స్టోరేజ్ ఎంపిక తో రూ. 13,999కే కొనుగోలు చేయవచ్చు.
Vivo Y81i –
Vivo Y811 Zeptoలో 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ కోసం రూ.7,999కే అందుబాటులో ఉంది.
స్మార్ట్‌ఫోన్‌లు ఢిల్లీ NCR, బెంగళూరులో ఉండే వినియోగదారులకు నేరుగా డెలివరీ చేయబడతాయి. ఆర్డర్ అందుకున్న 10 నిమిషాల్లో Vivo స్మార్ట్‌ఫోన్‌లను డెలివరీ చేస్తామని Zepto తెలిపింది. కంపెనీ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్‌ల ద్వారా రూ. 5,000 కంటే ఎక్కువ విలువైన మొబైల్ ఫోన్‌లను కొనుగోలు చేస్తే రూ. 5,000 వరకు తగ్గింపును కూడా అందిస్తోంది. Paytm, Amazon Pay, Cred ఇతర ప్రోగ్రామ్‌లతో సహా మొబైల్ వాలెట్ చెల్లింపులను ఎంచుకునే ఛాన్స్ ఉంది. ఆర్డర్‌లను ఇవ్వటానికి వినియోగదారులు Zepto వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా Vivo ఐటెమ్ డెలివరీ స్టేటస్‌లను తనిఖీ చేయవచ్చు.
వివో తీసుకొచ్చిన ఈ స్పీడ్ డెలివరీ ఆప్షన్ లో మరింత సేల్స్ పెరిగే ఛాన్స్ ఉందని ఆ సంస్థ అంచనా వేస్తుంది. అతి తక్కువ సమయంలోనే యూజర్ ను మొబైల్ చేరడంతో అత్యవసర సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తుంది.
ALSO READ : కృత్రిమ మేధలో భారత్ మరో ముందడుగు