India AI : కృత్రిమ మేధ (ఏఐ).. ప్రపంచవ్యాప్తంగా ఈ పదం జోరందుకుంది. టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కృత్రిమ మేధ తన అధికారాన్ని చెలాయించే ప్రయత్నాలు చేపడుతుంది. ఇప్పటికే చాట్ జీపీటీ, డీప్ సీక్ వంటి ఏఐ ఫ్లాట్పామ్స్ తమ హవా చూపిస్తుండగా తాజాగా భారత్ కృత్రిమ మేధలో మరో ముందడుగు వేసింది.
ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుండటంతో కృత్రిమ మేధ సైతం అదే స్థాయిలో విస్తరిస్తుంది. ఇక ప్రపంచ సాఫ్ట్ వేర్ రంగాన్ని త్వరలోనే కృత్రిమ మేధ శాసించనుందని తెలుస్తోంది. ఇందులో భారత్ కూడా మినహాయింపు కాదు. ప్రస్తుతం జీడీపీలో దాదాపు 7.5శాతం ఈ ఒక్క రంగం నుంచే లభిస్తుండగా… 2025 నాటికి ఇది 10% చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటీతో పాటు ఎడ్యూటెక్ రంగంలో 2030 నాటికి కృత్రిమ మేధ మార్కెట్ విలువ 80 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ప్రపంచంతో పోటీ పడుతూ భారత్ సైతం కృత్రిమ మేధ హబ్ పై తన పట్టు సాధించేందుకు ప్రయత్నాలు వేగవంతం చేస్తుంది. ఇందులో భాగంగా రూ.2,500 కోట్లతో ఏఐ ఎక్స్ లెన్స్ సెంటర్ ను ప్రారంభించాలని ప్రతిపాదన తీసుకొచ్చింది. “ప్రపంచవ్యాప్తంగా ఇండస్ట్రీలను ఏఐ పూర్తిగా మార్చేస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ తో పాటు ఇతర అప్లికేషన్లలో ఆధిపత్యం ప్రదర్శించడం అత్యవసరం..” అని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
ALSO READ : జియో యూజర్స్ కు భారీ షాక్.. మళ్లీ తగ్గిన రోజులు
ఇప్పటికే భారత్ ఈ దిశగా ప్రయత్నాలు చేపట్టి వ్యవసాయం, ఆరోగ్యం, సస్టైనబుల్ సిటీస్ రంగాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసింది. తాజాగా ప్రతిపాదించిన ఎక్స్ లెన్స్ సెంటర్ విద్యా ప్రయోజనాల కోసం వినియోగించనున్నట్టు తెలుస్తోంది.
ఇండియాలో మరో 10 నెలల్లో సొంతంగా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్‌ఎల్‌ఎం) వస్తుందని ఐటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ లాంగ్వేజ్ మోడల్ సొంత టెక్ట్ ను జనరేట్ చేయడంతో ఇతర ప్రోగ్రామ్స్ అందిస్తుంది. నిజానికి ఇది ఒక మెషిన్ లెర్నింగ్ ప్రాసెస్. చాట్‌జీపీటీ, డీప్‌సీక్ మోడల్స్ వలే ఇది పనిచేస్తుంది. .
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని వేగంగా నడిపిస్తున్న తరుణంలో అన్ని రంగాల్లో అత్యవసరంగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే దేశంలో కీలక రంగాల్లో దాదాపు 48 శాతం పని ఈ టెక్నాలజీ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యో నాటికి ఇది 55% పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు నిపుణులు. పలు రంగాల్లో 75% పైగా కార్యక్రమాలు ఏఐతో నిర్వహించే అవకాశం ఉందని.. ఇప్పటికే ఇంటి అవసరాలతో పాటు పంటలు పండించడం వరకు ఏఐ టెక్నాలజీ కనిపిస్తుందని తెలుపుతున్నారు. రోబోటిక్స్, మిషన్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ప్లాట్ఫామ్స్ రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో భారత్ సైతం తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో 68%, టెక్ ఇండస్ట్రీలో 65%, ఫార్మా అండ్ హెల్త్ కేర్ లో 52%, FMCG And Retail రంగంలో 40%, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ లో 12% ఏఐ టెక్నాలజీను ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది.