Indore Airport: ఇండోర్ ఎయిర్‌పోర్ట్‌లోని ఆశ్చర్యనక ఘటన చోటుచేసుకుంది. భోపాల్‌కు చెందిన అరుణ్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ వెళ్లిన అరుణ్ అక్కడ పని ముగించుకొని బెంగళూరుకు విమానంలో వెళ్లేందుకు సిద్దం అయ్యాడు. ఇండోర్ విమానంకు టికెట్ బుక్ చేసుకున్నాడు. ఈ క్రమంలో ఫ్లైట్ కోసం వెయిటింగ్ హాల్ కూర్చొన్నాడు. అదే సమయంలో ఓ ఎలుక అరుణ్ ఫ్యాంట్ లోపలికి వెళ్లింది. ఫ్యాంట్ లోపల ఏదో కదులుతున్నట్టు అరుణ్ గమనించాడు. ఎంత దులిపిన బయటికి రాక పోవడంతో బయటినుండి ఎలుకను పట్టుకున్నాడు. ఆ క్రమంలో ఎలుక అరుణ్ తొడపై గాయం చేసింది. ఎలుకను బయటికి తీసి ఓ కవర్‌లో వేసి ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి అందించాడు. ఆ సమయంలో ఎయిర్‌పోర్ట్ లో రేబిస్ ఇంజెక్షన్ లేకపోవడంతో వెంటనే ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఫస్ట్ ఎయిడ్‌ని అందించారు.