Jagapathi Babu: టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతిబాబు తాజాగా నేడు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్)(ED) విచారణకు హాజరయ్యారు. దాదాపు నాలుగు గంటల పాటు ఈడీ అధికారులు జగపతిబాబు(Jagapathi Babu)ను విచారణ జరిపినట్లు తెలుస్తోంది. అయితే జగపతిబాబు ఈడీ విచారణలో పాల్గొనడానికి కారణం లేకపోలేదు. జగపతిబాబు స్టార్ హీరోగా కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నో రకాల బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈయన గతంలో సాహితీ ఇన్ఫ్రా స్ట్రక్చర్ (Sahiti InfraStructure)లో భాగంగా పలు ప్రకటనలను నిర్వహించారు.
ఇలా సాహితీ ఇన్ ఫ్రాకు సంబంధించి ప్రచారకర్తగా జగపతిబాబు ఉన్న నేపథ్యంలో ఈయన నేడు ఈడీ విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరుతో సాహితీ ఇన్ఫ్రా భారీగా మోసం చేసినట్లు గతంలో ఫిర్యాదులు వచ్చాయి. జగపతిబాబు ప్రచారకర్తగా ఉన్న నేపథ్యంలో ఎంతోమంది పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఇలా ఫ్రీ లాంచ్ ఆఫర్ పేరిట 700 మంది నుంచి సుమారు 8 కోట్ల రూపాయల నగదును మోసం చేసినట్లు ఫిర్యాదులు రావడంతో తెలంగాణ పోలీసులు సాహితీ ఇన్ఫ్రా సమస్థకు చెందిన వారిపై కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే జగపతిబాబు కూడా సదరు సమస్థకు ప్రచారకర్తగా ఉన్న నేపథ్యంలో ఈయనకి కూడా విచారణకు రావాలని ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఈ నేపథ్యంలోనే నేడు జగపతిబాబు ఈడీ విచారణకు హాజరు కావడంతో సుమారు నాలుగు గంటల పాటు అధికారులు ఈయనని ప్రశ్నించారు. జగపతిబాబు సాహితీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మధ్య జరిగిన లావాదేవీల గురించి, సాహితీ లక్ష్మీనారాయణ కంపెనీ అకౌంట్ నుంచి జగపతి బాబుకు బదిలీ అయిన నగదు లావాదేవీల గురించి కూడా అధికారులు ఈ సందర్భంగా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఇలా వీరిద్దరి మధ్య పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిగిన నేపథ్యంలోనే అధికారులు జగపతిబాబును కూడా విచారణకు పిలిచి పలు ప్రశ్నలు వేసినట్టు సమాచారం.
విలన్ గానే సక్సెస్..
ఇక జగపతిబాబు సినిమా కెరియర్ విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో ఈయన హీరోగా కాకుండా విలన్ పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే హీరోగా కంటే కూడా జగపతిబాబు విలన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషలలో కూడా సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్న జగపతిబాబు మరోవైపు జయమ్ము నిశ్చయమురా కార్యక్రమాన్ని కూడా ప్రారంభించి ఈ కార్యక్రమానికి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఎంతో బిజీగా ఉండే జగపతిబాబు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియాలో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.
Also Read: Balakrishna : జగన్ ఓ సైకో గాడు… చిరంజీవిని గేట్ దగ్గరే..