RBI Recruitment: డిప్లొమా, బీఈ, బీటెక్(సివిల్, ఎలక్ట్రికల్) పాసైన అభ్యర్థులకు ఇది సూపర్ న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయితే మంచి వేతనం కూడా లభిస్తుంది.
నిరుద్యోగులు ఇది శుభవార్త. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జూనియర్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 20 తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 11
ఇందులో జూనియర్ ఇంజినీర్(సివిల్/ఎలక్ట్రికిల్) ఉద్యోగాలు ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్(సివిల్/ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు. 1 నుంచి 2 ఏళ్లు ఎక్స్ పీరియన్స్ ఉంటే సరిపోతుంది.
వయస్సు: 20 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. (ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్లు సడలంపు ఉంటుంది.)
దరఖాస్తు ఫీజు: రూ.450 ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
ఆన్‌లైన్‌లో ఎగ్జామ్ నిర్వహిస్తారు. మొత్తం 300 మార్కులకు గానూ పరీక్ష నిర్వహించున్నారు. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్, ఇంజినీరింగ్(టెక్నికల్‌కు సంబంధించినవి), జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
మొత్తం 180 ప్రశ్నలు అడుగుతారు. 150 నిమిషాల సమయం ఉంటుంది. మొత్తం 300 మార్కులకు గానూ పరీక్ష ఉంటుంది.
జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు వేతనం రూ.33,900- రూ.80,236 ఉంటుంది.
దరఖాస్తు చివరి తేది: 2025 జనవరి 20
రాతపరీక్ష తేది: 2025 ఫిబ్రవరి 8
Also Read: Group Syllabus Interview: గ్రూప్స్ సిలబస్ మారనుందా..? ఇంటర్వ్యూ ఉండొచ్చా..? అసలు నిజాలివే..!!
అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఇదే మంచి అవకాశం. ఇప్పుడే ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకోండి. ఉద్యోగాన్ని సాధించండి ఆల్ ది బెస్ట్.