E-Paper
Advertisement

నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. 3003 పోస్టులతో ఎస్ఎస్‌సీ నుంచి నోటిఫికేషన్, భారీ వేతనం

నిరుద్యోగులకు సూపర్ న్యూస్.. 3003 పోస్టులతో ఎస్ఎస్‌సీ నుంచి నోటిఫికేషన్, భారీ వేతనం
Advertisement

నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిరుద్యోగులకు మంచి అవకాశం కల్పించింది. 2026 సంవత్సరానికి సంబంధించి ఫేజ్-XIV సెలక్షన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో ఖాళీగా ఉన్న మొత్తం 3003 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ కొలువు సాధించాలనే పట్టుదలతో ఉన్న అభ్యర్థులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, వయస్సు, తదితర అంశాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.

మొత్తం పోస్టుల సంఖ్య: 3003

Advertisement

పోస్టుల వివరాలు:  ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. లాబొరేటరీ అసిస్టెంట్, డిప్యూటీ రేంజర్, లోయర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, అకౌంటెంట్ వంటి పోస్టులు ఉన్నాయి.

వీటితో పాటు జూనియర్ ఇంజినీర్, సైంటిఫిక్ అసిస్టెంట్, మార్కెటింగ్ అసిస్టెంట్, అగ్రికల్చర్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేస్తారు. డ్రైవర్, స్టోర్ కీపర్, టెక్నీషియన్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, నర్సింగ్ ఆఫీసర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, క్లర్క్ ఫార్మసిస్ట్, కోర్ట్ మాస్టర్ వంటి విభిన్న కేటగిరీల ఉద్యోగాలు ఈ జాబితాలో ఉన్నాయి.

Advertisement

విద్యార్హత: పోస్టులను బట్టి పదో తరగతి, ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే ఆఖరి తేదీ నాటికి అభ్యర్థులు సంబంధిత ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.

వయస్సు: వయోపరిమితిని పరిశీలిస్తే 2026 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 37 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

జీతం: ఎంపికైన వారికి నెలకు రూ.18,000 నుంచి గరిష్టంగా రూ.1,50,000 వరకు జీతభత్యాలు లభిస్తాయి.

సెలక్షన్ ప్రాసెస్:  ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBE), ధ్రువపత్రాల పరిశీలన, కొన్ని పోస్టులకు స్కిల్ టెస్ట్ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. పరీక్షా విధానం మొత్తం 100 ప్రశ్నలతో 200 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. పరీక్ష టైం 60 నిమిషాలు మాత్రమే ఉంటుంది. అభ్యర్థులు నెగటివ్ మార్కింగ్ పట్ల జాగ్రత్తగా ఉండాలి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 మార్కుల కోత విధిస్తారు.

దరఖాస్తు ఫీజు: ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణ అభ్యర్థులకు రూ.100 ఫీజు నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.

ముఖ్యమైన తేదీలు: ఏప్రిల్ 13 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు మే 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీజు చెల్లించడానికి మే 5 వరకు గడువు ఇచ్చారు. దరఖాస్తులో ఏవైనా తప్పులు ఉంటే మే 11 నుంచి 13 వరకు సవరించుకునే అవకాశం కల్పించారు.

రాత పరీక్ష: జూన్ 2026లో నిర్వహించే అవకాశం ఉంది. ఒక అభ్యర్థి తన అర్హతను బట్టి ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసే వీలుంది. అయితే ప్రతి పోస్టుకు విడివిడిగా దరఖాస్తు చేసుకుంటూ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

అఫీషిల్ వెబ్ సైట్: అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి మే 4 లోపు తమ దరఖాస్తులను సమర్పించాలి. సరైన ప్రణాళికతో సిద్ధమైతే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించడం సులభతరం అవుతుంది.

అఫీషియల్ వెబ్ సైట్: https://ssc.gov.in/

ALSO READ: సముద్ర గర్భంలో భారీగా బంగారు గనులు.. అద్భుతమైన పసిడి నిక్షేపాలు, ఎలా గుర్తించారంటే?

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×