E-Paper
Advertisement

RRB Recruitment 2025: నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

RRB Recruitment 2025: నిరుద్యోగులకు శుభవార్త.. రైల్వేలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
Advertisement

RRB Recruitment 2025: భారతీయ రైల్వే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ సంస్థ. అంతే కాకుండా ఈ సంస్థ ప్రతి సంవత్సరం లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలను అందిస్తుంది. రైల్వే 2025లో చాలా రిక్రూట్‌మెంట్‌లు చేయబోతోంది. వీటిలో గ్రూప్ డి రిక్రూట్‌మెంట్ మొదటిది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా రైల్వే వివిధ పోస్టుల్లో లక్షలాది మంది అభ్యర్థులకు ఉపాధి కల్పించనుంది.

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ గ్రూప్ డి లెవెల్ 1 కింద వివిధ పోస్టుల కోసం 32,438 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ జనవరి 23, 2025 నుంచి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 22, 2025న ముగుస్తుంది. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మొత్తం ఖాళీల సంఖ్య: 32,438

కేటగిరీ వారిగా పోస్టులు:

Advertisement

ట్రాఫిక్ పాయింట్స్‌మన్-B 5058
ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రాక్ మెషిన్-799

అసిస్టెంట్ (బ్రిడ్జ్)- 301

ట్రాక్ మెయింటెయినర్ Gr.IV -13187

అసిస్టెంట్ P-వే- 247
మెకానికల్ అసిస్టెంట్ (C&W)- 2587

అసిస్టెంట్ లోకో షెడ్ (డీజిల్)-420

అసిస్టెంట్ (Workshop)- 3077
S&T అసిస్టెంట్ (S&T)- 2012
ఎలక్ట్రికల్ అసిస్టెంట్ TRD- 1381

అసిస్టెంట్ లోకో షెడ్ (ఎలక్ట్రికల్)- 950

అసిస్టెంట్ ఆపరేషన్స్ (ఎలక్ట్రికల్)- 744

అసిస్టెంట్ TL & AC- 1041

అసిస్టెంట్ TL & AC (వర్క్‌షాప్)- 624

అర్హతలు:
అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణులైన ఉండాలి. లేదా NCVT నుండి నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) కలిగి ఉండాలి. RRB నిబంధనల ప్రకారం జూలై 1, 2025 నాటికి వయోపరిమితి 18 నుండి 36 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఫీజు:
జనరల్, OBC, EWS: రూ.500/-
SC, ST, PH: రూ.250/-
మహిళలు: రూ.250/-

పరీక్షా విధానం:
రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-1), ఫిజికల్ స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ , మెడికల్ టెస్ట్ ఉంటాయి.
జనరల్ సైన్స్: 25 ప్రశ్నలు
గణితం: 25 ప్రశ్నలు
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్: 30 ప్రశ్నలు
జనరల్ అవేర్‌నెస్: 20 ప్రశ్నలకు
1/3 మార్కు తప్పు సమాధానానికి తీసివేయబడుతుంది. సరైన సమాధానానికి +1 మార్కు ఇవ్వబడుతుంది.

Also Read: SBI లో 13 వేలకు పైగా ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి

ముఖ్యమైన తేదీలు:
నోటిఫికేషన్ తేదీ: డిసెంబర్ 28, 2024
దరఖాస్తు ప్రారంభ తేదీ: జనవరి 23, 2025
దరఖాస్తుకు చివరి తేదీ & ఫీజు చెల్లింపు: ఫిబ్రవరి 22, 2025

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×