Tips For White Hair: ఇప్పుడున్న రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా తెల్లజుట్టు వచ్చేస్తుంది. అయితే జుట్టు నెరవడానికి ప్రధాన కారణం ఏంటంటే.. వెంట్రుకకు రంగుని ఉత్పత్తి చేసే మెలనిన్ అనే కలర్ ప్రొడక్షన్.. జుట్టు కుదుళ్లలో తగ్గిపోవడం వల్ల.. తెల్లజుట్టు అనేది వస్తుందని నిపుణులు చెబుతున్నారు. చాలామంది వైట్ హెయిర్‌ని నివారించేందుకు బయట మార్కెట్లో దొరికే వివిధ రకాల హెన్నాలు, ఆయిల్స్ అప్లై చేస్తుంటారు.
ఇవి కెమికల్స్‌తో తయారుచేసి ఉంటాయి కాబట్టి.. మెలనోసైట్స్ దెబ్బతిని నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేయడం తగ్గించేస్తుంది. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. సహజ పదార్ధాలతో తయారు చేసిన ఈ హెయిర్ మాస్క్‌లు ట్రై చేశారంటే.. శాశ్వతంగా తెల్లజుట్టును నివారించవచ్చు.. మరి ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కరివేపాకు ఆలోవెరా జెల్ హెయిర్ మాస్క్..
కావాల్సిన పదార్ధాలు..
కరివేపాకు
అలోవెరాజెల్
కొబ్బరి నూనె
నిమ్మరసం
తయారు చేసుకునే విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అందులో కరివేపాకు వేసి బాగా నల్లగా వచ్చేంతవరకు వేయించండి. ఆ తర్వాత స్టవ్ కట్టేసి కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు వేయించిన కరివేపాకును మిక్సీజార్‌లో తీసుకుని మెత్తగా పొడి చేయండి. ఈ మిశ్రమాన్ని చిన్నగిన్నెలో తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ అలోవెరాజెల్, రెండు టేబుల్ స్పూన్ కొబ్బరినూనె వేసి బాగా మిక్స్ చేయండి.
ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు అప్లై చేసి.. గంట తర్వాత తలస్నానం చెయ్యండి. అంతే సింపుల్.. హెయిర్ మాస్క్ రెడీ అయినట్లే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మంచి రిజల్ట్ మీకు కనిపిస్తుంది. ఇందులో వాడే పదార్ధాల వల్ల జుట్టు ఒత్తుగా పెరగడంతో పాటు.. చుండ్రు సమస్యలను నివారిస్తుంది. ఇందులో ఉపయోగించే పదార్ధాలలో జుట్టుకు పోషణను అందించే విటమిన్లు అధికంగా ఉంటాయి.
Also Read: దోసకాయ తిని చనిపోయిన బాలుడు.. అసలు ఏం జరిగింది? వైద్యులు ఏం చెప్పారు?
హెన్నా, కాఫీపొడి హెయిర్ మాస్క్..
కావాల్సిన పదార్ధాలు
గోరింటాకు
కాఫీపొడి
నిమ్మరసం
తయారు చేసుకునే విధానం
ముందుగా గోరింటాకును మిక్సీజార్‌లో తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లో తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ కాఫీ పొడి, రెండు టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి. జుట్టు మెత్తగా, సిల్కీగా ఉండాలంటే.. ఇందులో గుడ్డులోని తెల్లసొనను యాడ్ చేయొచ్చు. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసి ఐదు నిమిషాలు పక్కనపెట్టండి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ళకు అప్లై చేసి.. గంట తర్వాత తలస్నానం చెయ్యండి.
ఇలా నెలకు రెండు సార్లు అప్లై చేస్తే.. క్రమంగా తెల్లజుట్టు తగ్గుముఖం పడుతుంది. ఇందులో వాడే పదార్దాలలో జుట్టుపెరుగుదలకు, వైట్ హెయిర్ నివారించేందుకు కావాల్సిన పోషకాలు అధికంగా ఉంటాయి. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.