E-Paper
Advertisement

SBI Clerk Recruitment 2025: GOOD NEWS.. 13,735 ఉద్యోగాలు.. వారం రోజులే గడువు..

SBI Clerk Recruitment 2025: GOOD NEWS.. 13,735 ఉద్యోగాలు..  వారం రోజులే గడువు..
Advertisement

SBI Clerk Recruitment 2025: బ్యాంకింగ్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం. ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) భారీ ఎత్తున క్లర్క్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా పెద్ద మొత్తంలో జూనియర్ అసోసియేట్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఆసక్తి గల అభ్యర్థాలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగాల సంఖ్య: 13,735

Advertisement

ఉద్యోగాలు: జూనియర్ అసోసియేట్స్(కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) ఉద్యోగాలు ఖాళీ గా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలోని హైదరాబాద్ సర్కిల్‌లో 342, ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి సర్కిల్‌లో 50 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

Advertisement

విద్యార్హత: ఏదైనా విభాగంలో డిగ్రీ పాసై ఉండాలి. డిగ్రీ ఫైనల్ / చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: 2024 ఏప్రిల్ 1 నాటికి 20 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. 1996 ఏప్రిల్ 2 నుంచి 2004 ఏప్రిల్ 1 మధ్య జన్మించి ఉండాలి. (ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు మూడేళ్ల, పీడీబ్ల్యూడీ(జనరల్/ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు పదేళ్లు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.)

వేతనం: నెలకు రూ.26,730.

ఎంపిక విధానం: ఆన్ లైన్ టెస్ట్(ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్), స్థానిక భాష పరీక్ష ద్వారా ఎంపిక జరుగుతుంది.

ప్రిలిమనరీ పరీక్ష: 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో మూడు విభాగాలుంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు, న్యూమరికల్ ఎబిలిటీ 35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు ఉంటాయి.

మెయిన్ పరీక్ష: 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నల సంఖ్య 190. ఇందులో నాలుగు పార్ట్స్ ఉంటాయి. జనరల్/ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు ఉంటాయి.

మెయిన్ పరీక్ష సమయం: 2 గంటల 40 నిమిషాలు

పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, అనంతపురం, గుంటూరు/విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

Also Read:Cochin Shipyard Jobs: ఐటీఐతో జాబ్స్.. మంచి వేతనం.. రేపే లాస్ట్ డేట్

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు చివరి తేది: 2025 జనవరి 7
ప్రిలిమనరీ పరీక్ష: 2025 ఫిబ్రవరి
మెయిన్ పరీక్ష: 2025 మార్చి లేదా ఏప్రిల్ లో జరగవచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://sbi.co.in/web/careers/current-openings

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×