E-Paper
Advertisement

తెలంగాణలో జనాభా గణనకు డేట్ ఫిక్స్.. ఈ తప్పులు అస్సలు చేయకండి?

తెలంగాణలో జనాభా గణనకు డేట్ ఫిక్స్.. ఈ తప్పులు అస్సలు చేయకండి?
Advertisement

Census Rules: స్వేచ్ఛ బ్యూరో: భారత జనాభా గణన – 2027 నిర్వహణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక ఉత్తర్వులను జారీ చేసింది. సెన్సస్ చట్టం 1948 ప్రకారం, రాష్ట్రంలో జనాభా గణన ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రజల బాధ్యతలు, ప్రభుత్వ నిబంధనలను వివరిస్తూ సాధారణ పరిపాలన శాఖ జీవోనెంబరు 54 పేరిట నోటిఫికేషన్‌ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలో 11 మే 2026 నుండి 9 జూన్ వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

ఆన్‌లైన్‌లో నమోదు..

ఈసారి జనాభా గణనను పూర్తిస్థాయిలో డిజిటల్ పద్ధతిలో నిర్వహించనున్నారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దీనికోసం 26 ఏప్రిల్ 2026 నుండి మే 10 వరకు గడువు నిర్ణయించారు. క్షేత్రస్థాయి సిబ్బంది ఇంటికి రాకముందే ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. అయితే సెన్సస్ అధికారులు అడిగే ప్రశ్నలకు ప్రజలు తమకు తెలిసినంత వరకు సరైన సమాధానాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఆచారాల ప్రకారం మహిళలు తమ భర్త, ఇతర వ్యక్తుల పేర్లు చెప్పకూడదనే నిబంధన ఉంటే మినహాయింపు ఉంటుంది. గణన కోసం వచ్చే అధికారులకు నివాస స్థలాల్లోకి ప్రవేశం కల్పించాలి.

Advertisement

Also Read: ఆ నియోజకవర్గాలకు ఇన్చార్జులెవరు?.. గులాబీలో మొదలైన చర్చ..!

మూడేళ్లు జైలు శిక్ష..

ఇంటి నంబర్లు వేయడానికి, గుర్తులు పెట్టడానికి అనుమతించాలి. ​జనాభా గణన విధులకు ఆటంకం కలిగించినా.. తప్పుడు సమాచారం ఇచ్చినా.. కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ​విధులకు ఆటంకం కలిగించినా, సమాచారం ఇవ్వడానికి నిరాకరించినా 1000 రూపాయల వరకు జరిమానా విధిస్తారు. ​గణన నిమిత్తం వేసిన నంబర్లను, గుర్తులను చెరిపివేసినా జరిమానా ఉంటుంది.​ నేర తీవ్రతను బట్టి జరిమానాతో పాటు గరిష్టంగా మూడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ​ప్రజలు ఇచ్చే వ్యక్తిగత సమాచారం అత్యంత గోప్యంగా ఉంచబడుతుందని సీఎస్ ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు.

Advertisement

Also read: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..?

Related News

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Big Stories

Advertisement
×