BigTV English

CBSE Scholarship : పేరెంట్స్ కు మీరొక్కరే అమ్మాయా! మరి ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేశారా!

CBSE Scholarship : పేరెంట్స్ కు మీరొక్కరే అమ్మాయా! మరి ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేశారా!

CBSE Scholarship : పేరెంట్స్ కు మీరు ఒక్కరే అమ్మాయా? ఇప్పటికే 10వ తరగతి పూర్తి చేసి ఉన్నారా? అయితే సీబీఎస్‌ఈ (CBSE) ప్రకటించిన ఈ స్కాలర్‌షిప్‌ మీకోసమే. అసలు ఏంటి ఈ స్కాలర్‌షిప్‌ స్కీమ్? ఎలా అప్లై చేయాలి? వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం


సీబీఎస్‌ఈ (CBSE) తాజాగా సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్ షిప్ ను ప్రకటించింది. ఈ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ (CBSE Merit Scholarship) స్కీమ్‌ తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉండి ప్రతిభావంతులైన ఆడపిల్లల కోసమే. ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకే సీబీఎస్‌ఈ ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది.

అయితే ఇప్పటికే 2024 కి సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. డిసెంబర్ 23తో ఈ గడువు కూడా ముగిసింది. కానీ తాజాగా ఈ గడువును మరోసారి పొడిగించింది సీబీఎస్‌ఈ. పదో తరగతి పరీక్షల్లో 70శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థినులు 2025 జనవరి 10 వరకూ ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చని తెలిపింది. అయితే అసలు ఈ స్కాలర్షిప్ ను ఎవరు అప్లై చేసుకోవచ్చు. దీని వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం.


⦿ తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లలు అప్లై చేసుకోవచ్చు.

⦿ సింగిల్ గర్ల్ చైల్డ్ ను విద్యలో ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ మెుదలైంది.

⦿ ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినులకు ప్రతి నెలా రూ. 1000 చొప్పున రెండేళ్ల పాటు డబ్బులు వస్తాయి.

⦿ ఆ విద్యార్థినికి చెందిన ఖాతాలోనే ఈ మొత్తాన్ని ప్రతీ నెలా జమ చేస్తారు.

⦿ దరఖాస్తు చేసుకొనే విద్యార్థినులు సీబీఎస్‌ఈలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

⦿ ప్రస్తుతం సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాల్లో 11, 12వ తరగతులు అభ్యసిస్తూ ఉండాలి.

⦿ పదో తరగతి పరీక్షల్లో కనీసం 70శాతం, ఆ పైన మార్కులు సాధించిన వారే ఈ స్కాలర్‌షిప్‌ కు అర్హులు

⦿ విద్యార్థిని ట్యూషన్‌ ఫీజు పదో తరగతిలో నెలకు రూ.2500.. సీబీఎస్‌ఈ 11, 12 తరగతులకు రూ.3వేలు మించరాదు.

⦿ సీబీఎస్‌ఈ బోర్డులో చదువుతున్న ఎన్నారై విద్యార్థినులూ ఈ అవార్డుకు అర్హులే. వీరి ట్యూషన్ ఫీజు నెలకు రూ.6వేలు మించొద్దు.

⦿ ఈ స్కాలర్‌షిప్‌నకు ఇప్పటికే ఎంపికైన విద్యార్థినులు మాత్రం 11వ తరగతి తర్వాత మళ్లీ రెన్యువల్‌ చేసుకోవాలి.

⦿ 11వ తరగతి నుంచి 12వ తరగతికి రెన్యువల్‌ చేయించుకోవాలంటే కనీసం 70శాతం మార్కులు సాంధించాలి

⦿ ఇక వారి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.8లక్షల కన్నా తక్కువ ఉండాలి

⦿ ఈ దరఖాస్తులను సంబంధిత పాఠశాలలు జనవరి 17వరకు వెరిఫికేషన్‌ను పూర్తి చేయాలి.

ALSO READ : స్మార్ట్ టీవీ ఆఫర్ లో కొనేస్తారా! అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్ ఉందిగా!

Related News

AAI Notification: ఏఏఐలో భారీగా ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ.1,40,000.. ఇంకెందుకు ఆలస్యం

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

Big Stories

×