E-Paper
Advertisement

Forest Department: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. 6నెలల్లో ఉద్యోగంలో ఉంటారు..

Forest Department: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు.. 6నెలల్లో ఉద్యోగంలో ఉంటారు..

Forest Department: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అటవీ శాఖలో పలు ఉద్యోగాలను భర్తీ చేసే యోచనలో ఉంది. ఇందులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే అటవీ శాఖలో ఉద్యోగాల భర్తీకి తాజా సమాచారం అందుబాటులోకి వచ్చింది. అటవీ శాఖలో ఖాళీగా ఉన్న 689 పోస్టులకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ద్వారా ఆరు నెలల్లో భర్తీ చేయనున్నట్లు ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పీసీసీఎఫ్) చిరంజీవి చౌదరి తెలిపారు. అన్నమయ్య జిల్లాలో బి.కొత్తకోటలో ఆయన మీడియాతో మాట్లాడారు. అటవీ శాఖలో రేంజ్, సెక్షన్, బీట్ ఆఫీసర్ ఉద్యోగాలతో పాటు ఇతర ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాలకు 18 నుంచి 32 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు అర్హులవుతారు. ఇంటర్, డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉండాలి. ముందు రాత పరీక్ష నిర్వహిస్తారు. రాత పరీక్షలో మెరిట్ వచ్చిన అభ్యర్థులకు ఫిజికిల్ ఈవెంటన్ నిర్వహిస్తారు. రాత పరీక్ష, ఫిజికల్ ఈవెంట్ లో మెరిట్ సాధించిన అభ్యర్థులను ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ ను అధికారులు విడుదల చేయనున్నారు. ఆరు నెలల్లో రిక్రూట్ మెంట్ ప్రాసెస్ ను పూర్తి చేయనున్నారు. ప్రస్తుతానికి నోటిఫికేషన్ డేట్, ఎగ్జామ్ తేదీలు గురించి ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. త్వరలోనే సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేస్తారు.

Also Read: CBI Recruitment: డిగ్రీ పాసైతే చాలు.. 1000 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇంకా పది రోజులు మాత్రమే ఛాన్స్..!

ఫారెస్ట్ లో ఉద్యోగం సాధించాలనే వారు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మొదలు పెట్టండి. రెండు పేపర్లతో ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంటుంది. ఒక పేపర్లో జీఎస్, రెండో పేపర్లో మ్యాథ్స్ ఉండే అవకాశం ఉంది. సిలబస్ ను ఒక సారి క్షుణ్ణంగా తెలుసుకుని నంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేస్తే ఎగ్జామ్ లో మంచి మార్కులు పొందుతారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ప్రిపరేషన్ షురూ చేయండి ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×