Jayamala.. కన్నడ నటి జయమాల (Jayamala)అంటే తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన హీరోయినే. అయితే ఇప్పటి జనరేషన్ వాళ్ళకు కాకుండా 80’స్ ప్రేక్షకులకు ఈ హీరోయిన్ తెలిసి ఉంటుంది. తెలుగులో జయమాల, చిరంజీవి (Chiranjeevi) నటించిన ‘రాక్షసుడు’ అనే సినిమాతో ఫేమస్ అయ్యింది. ఈ సినిమా తర్వాత తెలుగులో కూడా జయమాలకి ఆఫర్స్ వచ్చాయి. ఇక తెలుగు కంటే ఎక్కువగా కన్నడలో స్టార్ హీరోయిన్ గా పేరుపొందిన జయమాల తాజాగా తన కూతురుకి గ్రాండ్ గా పెళ్లి చేసింది. ఇక జయమాల కూతురు పెళ్లికి కన్నడ తారలందరూ విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు.మరి ఇంతకీ జయమాల కూతురు పెళ్లిలో ఎవరెవరు సందడి చేశారో ఇప్పుడు చూద్దాం..
కన్నడ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న జయమాల..
కన్నడ, తమిళ, తెలుగు, తుళు భాషల్లో హీరోయిన్ గా నటించిన జయమాల, కన్నడలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఇక ఈమె మొదటి సినిమా కాస్ దాయె కండన్.. ఇది తుళు సినిమా.. అలా సినిమాల్లోకి వచ్చిన జయమాల(Jayamala) తమిళ,కన్నడ సినిమాల్లో కూడా రాణించింది. ముఖ్యంగా కన్నడలో స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు సంపాదించింది. ఇక అప్పటి హీరోలైనటువంటి శివ రాజ్ కుమార్ (Siva Raj Kumar), అంబరీష్(Ambareesh), అనంత కుమార్(Ananth Kumar) ,టైగర్ ప్రభాకర్ (Tiger Prabhakar), కంఠీరవ రాజ్ కుమార్ (Raj Kumar), శంకర్ నాగ్(Shankar Nag) , విష్ణువర్ధన్ (Vishnu Vardhan), లోకేష్ (Lokesh) వంటి ఎంతోమంది కన్నడ హీరోలతో ఆడి పాడింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తెలుగులో భామా రుక్మిణి, అర్జున గర్వభంగం, రాక్షసుడు (Rakshasudu)వంటి సినిమాలు చేసింది.
ఘనంగా జయమాల కూతురు పెళ్లి..
ముఖ్యంగా రాక్షసుడు సినిమాతో టాలీవుడ్ లో ఫేమస్ అయిన జయమాల మొదట తెలుగు ఇండస్ట్రీలో విలన్ గా పలు సినిమాల్లో నటించిన టైగర్ ప్రభాకర్ (Tiger Prabhakar)ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అయితే వీరిద్దరి ప్రేమ ఎన్నో రోజులు నిలువలేదు. ఆ తర్వాత ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో టైగర్ ప్రభాకర్ కి విడాకులు ఇచ్చేసి కన్నడ ఇండస్ట్రీలో కెమెరామెన్ గా పనిచేస్తున్న హెచ్ఎం రామచంద్ర(H.M. Ramachandra)ని ప్రేమించి రెండో పెళ్లి చేసుకుంది.వీరిద్దరికి సౌందర్య (Soundarya) అనే కూతురు కూడా ఉంది.అలా జయమాల – రామచంద్రల ఏకైక కూతురు సౌందర్య (Soundarya) వివాహం ఈరోజు ఘనంగా జరిగింది.
పెళ్లికి విచ్చేసిన సెలబ్రిటీ అతిధులు వీరే..
బెంగళూరులో కూతురు పెళ్లి చేసిన జయమాల కన్నడ ఇండస్ట్రీ నుండి ఎంతోమందికి ఆహ్వానం పంపింది.అలా జయమాల కూతురు సౌందర్య పెళ్ళికి కన్నడ స్టార్ హీరో అయినటువంటి యష్ (Yash) తన భార్యతో కలిసి వచ్చారు. అలాగే కిచ్చా సుదీప్(Kiccha Sudeep) కూడా ఈ పెళ్లికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ప్రస్తుతం సౌందర్య పెళ్ళికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.