Anil Ravipudi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు సొంతం చేసుకున్నారు అనిల్ రావిపూడి (Anil Ravipudi). తాజాగా ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జనవరి 14న సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాతో అనిల్ రావిపూడి పేరు కూడా భారీగా మారుమ్రోగుతోంది. సంక్రాంతికి బ్లాక్ బాస్టర్ ఇచ్చాడు అంటూ ఆయన పై పలువురు ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. ఇదిలా ఉండగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న అనిల్ రావిపూడి తాజాగా నిన్న ఆదివారం హైదరాబాద్ లో జరిగిన ‘లైలా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చారు. విశ్వక్ సేన్ (Vishwak sen) హీరోగా.. తొలిసారి లేడీ గెటప్ లో నటిస్తున్న చిత్రం లైలా. ఫిబ్రవరి 14వ తేదీన వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం రోజు గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
అనిల్ రావిపూడి పై నిర్మాత కౌంటర్..
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఆయనతోపాటు అనిల్ రావిపూడి, ప్రముఖ నిర్మాత సాహు గారపాటి(Sahoo garapati) కూడా విచ్చేశారు. ఈ ముగ్గురు కలయికలో ఇప్పుడు ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఈ లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ స్పీచ్, చిరు మాట్లాడిన మాటలు అలాగే అనిల్ రావిపూడి ఫన్నీ స్పీచ్ లు అన్నీ కూడా హైలెట్ అయ్యాయి. అందులో భాగంగానే .. అనిల్ రావిపూడి స్పీచ్ ఇస్తున్నప్పుడు మధ్యలో కలుగజేసుకొని నిర్మాత సాహు గారపాటి కౌంటర్లు వేశాడు. “ఇంకెన్ని రోజులు సంక్రాంతికి వస్తున్నాం అంటూ అదే సినిమాని పట్టుకొని వేలాడుతావ్..? ఇక పబ్లిసిటీ ఆపి మన సినిమాలోకి ఎప్పుడు వస్తావు” అన్నట్టుగా సెటైర్లు వేయడం జరిగింది. ఇక దీంతో అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “ఇకపై మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టను. ఇంకో ఈవెంట్ మాత్రమే ఉంది. అది ముగించుకొని అన్నయ్య మూవీ మొదలు పెడతాను” అంటూ ఆన్సర్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. ఇక అనిల్ రావిపూడి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి
చిరు మూవీపై చిన్న అప్డేట్ ఇచ్చిన అనిల్ రావిపూడి..
అంతేకాదు ఇదే కార్యక్రమంలో చిరంజీవితో సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని కూడా ఆయన కాస్త లీక్ చేశారు. ఇక ఈ వేదికపై ఈ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించిన సుమా కనకాల (Suma Kanakala) ఈసారి బ్లాక్ బస్టర్ పొంగల్ అన్నారు.. నెక్స్ట్ మెగా పొంగల్ అంటారా? అని అడిగితే..” ఏమో అనొచ్చేమో.. అయినా అవన్నీ మన బాస్ స్టేజ్ మీదకు వచ్చినప్పుడు మాట్లాడుతాడు. ఆయన చెబితేనే మెగా లీక్స్ అన్ని బాగుంటాయి” అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అనిల్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈయన.. ఇప్పుడు తన సొంత ఊరిలో ఒక ఇంటిని నిర్మించుకున్నారు. ఫిబ్రవరి 12వ తేదీన గృహప్రవేశం కూడా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే తన సెంటిమెంటు ప్రకారం.. అనిల్ రావిపూడి చిరంజీవితో చేయబోయే సినిమా స్క్రిప్ట్ పనులు మొదలుపెట్టనున్నట్లు సమాచారం. మరి కామెడీ జానర్ ను నమ్ముకొని, ఫ్యామిలీ ఆడియన్స్ ను టార్గెట్ గా పెట్టుకొని, ముందుకు సాగుతున్న అనిల్ రావిపూడి.. చిరు తో సినిమా చేసి ఎలాంటి సక్సెస్ అందిస్తారో చూడాలి.